- Telugu News Photo Gallery World photos This village is available on rent for only 1 thousand rupees, you will be surprised to see its beauty
Rent Your Own Village: కేవలం వెయ్యి రూపాయలకే అద్దెకు లభించే గ్రామం.. ఎన్నో అందాలు దీని సొంతం ఎక్కడో తెలుసా..
ప్రపంచంలోనే ఇంత అందమైన గ్రామం ఉందని.. అది కూడా కేవలం 1,000 రూపాయలకే అద్దెకు లభిస్తుందని మీకు తెలుసా? అవును, ఈ గ్రామం ఇటలీలో ఉంది. రోమ్ నుండి కొన్ని గంటల ప్రయాణిస్తే ఈ గ్రామానికి చేరుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, కోట, రెస్టారెంట్, బార్ మొదలైన అన్ని సౌకర్యాలు ఈ గ్రామంలో ఉన్నాయి
Updated on: Nov 25, 2022 | 11:36 AM

ప్రపంచంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అత్యంత సుందరమైన, అందమైన ప్రదేశాలను సందర్శించిన తర్వాత.. వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని భావిస్తారు. అయితే సాధారణంగా ఏ ప్రదేశంలోనైనా పర్యటించాలంటే.. వేల రూపాయలు ఖర్చవుతాయి. హోటల్ లో ఉండడం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఓ అందమైన గ్రామం ఉందని.. అది కూడా కేవలం వెయ్యి రూపాయల అద్దెకు లభిస్తుందని మీకు తెలుసా?

ఇటాలియన్ గ్రామం పెట్రిటోలి ఒక రాత్రికి కేవలం రూ. 1000 అద్దెకు లభిస్తుంది. విశేషమేమిటంటే స్విమ్మింగ్ పూల్, కోట, రెస్టారెంట్, బార్ మొదలైన అన్ని సౌకర్యాలు ఈ గ్రామంలో ఉన్నాయి.

ఇటలీ రాజధాని రోమ్ నుండి కొన్ని గంటల ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో ఉన్న కోట, ప్యాలెస్‌లో బస చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ బస చేసిన తర్వాత.. ఎవరైనా సరే తాను చక్రవర్తిలా భావించాల్సిందే. అంతగా ఉంటాయి ఆ గ్రామంలోని సౌకర్యాలు

ఈ గ్రామంలో బస చేసేందుకు స్థలం ఉన్న స్థలంలో దాదాపు 200 మంది హాయిగా జీవించవచ్చు. ఇక్కడ మొత్తం 98 గదులు ఉన్నాయి. ది సన్ నివేదిక ప్రకారం, 150 మంది.. 6 రాత్రులు బస చేస్తే.. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అంటే ఒక వ్యక్తి రాత్రికి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట.

అయితే, ఇటలీలో మాత్రమే ఇలాంటి ఆఫర్‌లు లభిస్తాయి. ప్రెసిక్స్ నగరంలో ఇళ్ల స్థలాలను 25 లక్షల రూపాయలకే ప్రజలకు అందిస్తున్నారు అక్కడ స్తానిక అధికారులు





























