Adulterated milk: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. యూరియా, ఆయిల్‌ మిక్స్‌ చేసి పా’పాలు’

మీ పాలలో నూనె ఉందా ? లేదా...! సరే కనీసం యూరియా అయినా ఉందా ? పాలలో నూనె, యూరియా ఏంటని తెగ ఆలోచించ్చొద్దు ! ఇదేదో కోల్గెట్‌ టైపు యాడ్‌ కాదు...! మిల్క్‌ మాఫియా చేస్తున్న ఫ్రాడ్‌...! స్వచ్ఛమైన పాలను... కాలకూట విషంలా మార్చేస్తున్నారు. యూరియా, ఆయిల్‌ మిక్స్‌ చేసి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు.

Adulterated milk: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. యూరియా, ఆయిల్‌ మిక్స్‌ చేసి  పా'పాలు'
Adulterated Milk
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 26, 2022 | 7:59 PM

ఉదయం లేవగానే వేడి వేడి టీ పడితే కానీ… కొందరికి రోజు మొదలు కాదు. మరికొందరికి కాఫీతోనే డే స్టార్ట్‌ అవుతుంది. ఇలా రోజువారీ జీవితంలో అన్నింటికీ పాలుతో చాలా పనుంది ! అలాంటి పాలు ఇప్పుడు కల్తీ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మీరు తాగుతున్నవి అసలు పాలే కాదు. పాలలా కన్పించే పాలకూట విషం. కాదేదీ కల్తీకి అనర్హం ! ఇప్పుడదే జరుగుతోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలనే టార్గెట్‌ చేస్తున్నారు కల్తీగాళ్లు. అందులోనూ నిత్యం వాడే పాలను కల్తీ చేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల కల్తీ పాల దందా కలకలం రేపుతున్నాయి. అదే రంగు… అదే రుచి… ఏమాత్రం తేడా ఉండదు ! ఒరిజినల్‌ మిల్క్‌తో పోల్చుకుంటే ఇంకాస్త చిక్కగా… చక్కగా ఉంటాయి. ఏవైనా పాలే కదా అని తాగేస్తే…. ఆసుపత్రిపాలు కావడం ఖాయం ! అసలు-నకిలీ మధ్య తేడా గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవ్‌ ! రీసెంట్‌గా కల్తీ పాలు బాపట్ల జిల్లాలో కలకలం రేపాయి.

అద్దంకిలో కల్తీ పాల తయారీ గుట్టురట్టు అయింది. ద్వారకా నగర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు.. బొమ్మనంపాడు గ్రామానికి చెందిన సుధీర్‌తో పాటు.. మరో ఆరుగురిని అరెస్టు చేశారు. కల్తీ పాలకు వినియోగించే నూనె, పౌడర్‌తోపాటు జ్యూస్ మిక్సర్లలను, స్వాధీనం చేసుకున్నారు. రోజూ వెయ్యి లీటర్ల కల్లీ పాలను తయారు చేసి డైయిరీలకు తరలిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. పాల పౌడర్‌లో ఆయిల్‌ మిక్స్‌ చేసి… ఫ్యాట్‌ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలల్లో వెన్న శాతం.. చలికాలంలో 8 శాతం కంటే మించదు కాబట్టి… ధర తక్కువగా వస్తున్నందున.. ఈ విధంగా చేయడం ద్వారా వెన్నశాతాన్ని 8.5 పాయింట్లకు పెంచుతున్నారు.

అప్పట్లో పాలలో కాసిన్ని నీళ్లు కలిపేవారు ! అలాంటి పాలు తాగితే పెద్దగా లాభం లేకపోయినా నష్టం మాత్రం జరగదు. కానీ ఇప్పుడలా కాదు… ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ఇవి తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. రోజూ లక్షలాది లీటర్లను ఉత్పత్తి చేసి రికార్డు సాధించిన చిత్తూరు జిల్లాలో… ఇప్పుడు కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పాల ఉత్పత్తి దారుల నుంచి సేకరిస్తున్న పాలను.. కల్తీ చేస్తున్న ముఠాల దందా దర్జాగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మిల్క్‌ పుల్లింగ్‌ పాయింట్ల నుంచి బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లకు అక్కడి నుంచి డెయిరీలకు ఎగుమతి చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

గ్రామాల్లో పాడి రైతుల నుంచి పాలను సేకరించి.. ఆ పాలను కల్తీ చేసి అమ్మకాలు సాగిస్తున్న ముఠాలు విచ్చల విడిగా దందా కొనసాగిస్తున్నారు. పాడి రైతుల నుంచి పాలను సేకరించి.. మాల్టో డెక్సిన్‌, స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌, సన్‌ఫ్లవర్‌ రీఫైన్డ్‌ ఆయిల్‌ను కలిపి.. పాలలో చిక్కదనం, వెన్నశాతం పెంచి కల్తీ పాల వ్యాపారం చేస్తూ.. వెదురు కుప్పంలో మురహరిరెడ్డి అనే వ్యక్తి.. చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు చిక్కాడు. ఇక కేవీ పల్లి మండలం.. చిన్నగోరంట్లపల్లికి చెందిన సంజీవరెడ్డి అనే వ్యక్తి కూడా… పాలను కల్తీ చేస్తూ విక్రయిస్తుండగా పట్టుకున్నారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.

అసలు ఈ కల్తీ పాలను ఎలా తయారు చేస్తున్నారో.. వెదురు కుప్పంలో పట్టుబడ్డ వ్యక్తి నుంచి.. తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. ఇలా కల్తీ జరిగి పాల బీఎంసీలకు అటు నుంచి డెయిరీలకు చేరాక.. ఆ పాలే వినియోగదారుడికి ప్యాకెట్ల రూపంలో చేరుతున్నాయి. ఈ పాలను పరీక్షించే ప్రయత్నం చేసింది టీవీ9 టీమ్‌. ఇందులో భాగంగానే.. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలోని డెయిరీ టెక్నాలజీ కాలేజీ ల్యాబోరేటరీకి.. రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన పాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించింది.

ఇలాంటి కల్తీ పాలు ఆరోగ్యానికి చాలా హానికరం ! ఈ పాలను పిల్లలకు ఇస్తే దుష్పరిణామాలు మన ఊహకు అందని స్థాయిలో ఉంటాయి. తెలిసో తెలియకో రోజూ కృత్రిమ పాలు తాగితే అందులోని కొవ్వుతో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. దీనిలో కలిపే యూరియా ఒక మోస్తరు విషపదార్థంగా పనిచేస్తుంది. కల్తీపాలతో అధిక రక్తపోటు, గుండె సంబంధవ్యాధులు వస్తాయి. కిడ్నీలు దెబ్బతింటాయి. మొదడు, కాలేయం, మూత్రపిండాలపై కూడా కల్తీ పాల ప్రభావం ఉంటుంది. ఫిట్స్‌ వచ్చే అవకాశాలుంటాయి. కండరాల్లో వణుకు కూడా రావొచ్చు. అందుకే ఈ కల్తీపాల పట్ల అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి !

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!