చిన్న దోమే కదా అని లైట్ తీసుకోవద్దు..! 30 ఆపరేషన్లు చేసినా కోలుకోని ఓ వ్యక్తి కోమాలోకి జారిపోయాడు..
దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయట.. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం అతడు..
దోమలు కుట్టడాన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోము. అంటే అవి రక్తం పీల్చడం, దురద, వాపు వంటివి సహజం. అయితే దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. దోమ కాటుకు గురై ఓ వ్యక్తి కోమాలోకి వెళ్లిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. దోమ కాటుతో ఓ వ్యక్తి 30 సర్జరీలు చేయించుకుని కోమాలోకి వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క దోమ కాటు వల్ల ఒక వ్యక్తికి 30 ఆపరేషన్లు జరిగాయి. ఈ సంఘటన జర్మనీలో జరిగినట్టుగా తెలిసింది.
జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి ఆసియా టైగర్ జాతికి చెందిన దోమ కరిచింది. గత ఏడాది అతడు దోమ కాటుకు గురయ్యాడు. ఆసియా టైగర్ దోమ కాటు వల్ల సెబాస్టియన్‌కు ఇన్‌ఫెక్షన్ సోకి, క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి.. అవి పనిచేయడం మానేశాయి. చివరకు ఎడమ తొడపై చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది.
ఆసియా టైగర్ దోమ సెబాస్టియన్ ఎడమ తొడపై కుట్టింది. దోమ కాటు ద్వారా సెరాటియా అనే బ్యాక్టరీయా శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అతడిలో ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపించాయట.. ఆ తర్వాత మెల్లి మెల్లిగా అతడి పరిస్థితి రోజు రోజూకు దిగజారింది. పూర్తి అనారోగ్యం భారిన పడ్డాడు. తొడ భాగం మొత్తం పాడవడంతో.. అతడు మంచానికే పరిమితమయ్యాడు. చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు కోమాలో ఉన్నాడు. దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయట.. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం సెబాస్టియన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ అతడి ఆరోగ్యం మునపటిలా పూర్తి ఆరోగ్యంగా ఉండలేడు. ఇలాంటి దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి