Hot Water Bath: వామ్మో.. వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఆ సమస్యలు తప్పదంట జాగ్రత్త..

శీతాకాలం ప్రారంభం అయింది. ఉష్ణ్రోగ్రతలు పడిపోతున్నాయి. చలితో ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు వేడి నీటితో స్నానం చేయడం ప్రారంభిస్తారు.

Hot Water Bath: వామ్మో.. వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఆ సమస్యలు తప్పదంట జాగ్రత్త..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2022 | 10:01 AM

Hot Water Bath: శీతాకాలం ప్రారంభం అయింది. ఉష్ణ్రోగ్రతలు పడిపోతున్నాయి. చలితో ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు వేడి నీటితో స్నానం చేయడం ప్రారంభిస్తారు. అయితే, వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? ఆలోచించకపోతే.. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. అసలు మంచిదా..? కాదా..? అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరానికి కలిగే కొన్ని నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మంపై ప్రభావం: వేడి నీరు చర్మంపై కెరాటిన్ కణాలను దెబ్బతీస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ తొలగిపోతుంది. రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దద్దుర్లు, తామర, మొటిమలు లేదా దురద వంటి చర్మ సమస్యలు వస్తాయి.

జుట్టు సమస్యలు: వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులో తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల జుట్టు గరుకుగా, పొడిగా మారుతుంది. చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా జుట్టులో చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటు: వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ చాలా వేగంగా జరుగుతుంది. వేగవంతమైన రక్త ప్రసరణ రక్తపోటుకు దారితీస్తుంది. ఇది క్రమంలో గుండె ఆరోగ్యాన్ని కూడా బలహీనపరుస్తుంది.

స్నానానికి ఎలాంటి నీటిని ఉపయోగించాలి..

చాలా సేపు వేడి నీటిలో ఉన్నా లేదా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం, ఆరోగ్యం రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే స్నానం చేసే ముందు నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. స్నానం చేసే నీరు ఎక్కువగా వేడిగా ఉండకూడదని.. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందని పేర్కొంటున్నారు.

  • స్నానం చేసే నీరు చాలా వేడిగా ఉండకూడదు.
  • నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలి.
  • వేడినీళ్లూ, చల్లటి నీళ్లూ కలుపుకుని స్నానం చేస్తే కీళ్ల నొప్పుల సమస్య నయమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..