White Tongue: నాలుక తెల్లగా కనిపిస్తోందా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ జబ్బులకు సంకేతం కావొచ్చు

శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, అది ఆరోగ్యంలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీని వల్ల నాలుకపై తెల్లటి పూత వస్తుంది. అలాగే నాలుక పాలిపోతే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉన్నాయని అర్థం.

White Tongue: నాలుక తెల్లగా  కనిపిస్తోందా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ జబ్బులకు సంకేతం కావొచ్చు
White Tongue
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2022 | 9:58 AM

మనం డాక్టర్ల దగ్గరకు వెళితే ముందుగా నాలుక చూపించమంటారు. అలా చూస్తే మన ఆరోగ్యం గురించి ఏం తెలుస్తుంది? అని చాలామంది అనుకుంటారు. అయితే మన నాలుకే మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. ముఖ్యంగా మన నాలుక రంగుమారుతూ ఉంటే అనారోగ్య సమస్యలున్నట్లే అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో ఉంటుంది. తేమగా, మృదువుగా ఉంటుంది. అయితే ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం నాలుక రంగు మారుతుంది. ముఖ్యంగా చాలామందికి తరచూ నాలుక తెల్లగా మారుతంది. ఇది భయపడేంత పెద్ద రోగమేమీ కాదు కానీ నిర్లక్ష్యం మాత్రం వహించకూడదు. ఎందుకంటే తెల్లనాలుకతో ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ తెల్లనాలుకకు కారణమేంటో తెలుసుకుందాంరండి. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, అది ఆరోగ్యంలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీని వల్ల నాలుకపై తెల్లటి పూత వస్తుంది. అలాగే నాలుక పాలిపోతే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉన్నాయని అర్థం. ఐరన్, ప్రొటీన్ల లోపానికి కూడా ఇది సంకేతం. మీ నాలుక ఇలా కనిపిస్తే పౌష్టికాహారాన్ని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ సమస్య చాలా తీవ్రమైనది కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో తెల్ల నాలుక ఎయిడ్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. కీమోథెరపీ వంటి చికిత్సలు పొందుతున్న వ్యక్తులలో కూడా తెల్లటి నాలుక కనిపిస్తుంది. మీరు కూడా అటువంటి తెల్ల నాలుక సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే. అందుకు సరైన జీవనశైలి, మంచి ఆహారం కూడా అలవర్చుకోవాలి. అతిగా ఆలోచించడం, ఒత్తిడి తగ్గించండి. దీర్ఘకాలిక ఒత్తిడి మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సరైన నిద్ర, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆహారం, తగినంత వ్యాయామం మీ దినచర్యలో చేర్చుకోండి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే