Diabetes: డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. పొరపాటున కూడా ఈ పండ్లను తినకండి.. అలా చేస్తే పెను ప్రమాదమే..
ప్రస్తుత కాలంలో లక్షలాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌కు ముఖ్యకారణం అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి అని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత కాలంలో లక్షలాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌కు ముఖ్యకారణం అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి అని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్‌లో ఆహారం చాలా త్వరగా ప్రభావితమవుతుంది. ఇందులో షుగర్ లెవెల్ కాస్త పెరిగిన వెంటనే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, డయాబెటిస్‌లో కొన్ని పండ్లను తినడం మంచిదే కానీ.. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొన్ని పండ్లను ఆరోగ్యకరమైనవిగా పరిగణించి షుగర్ బాధితులు తింటారు. అయితే.. కొన్ని పండ్లను మధుమేహంలో తీసుకుంటే అవి ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని పేర్కొంటున్నారు. మధుమేహంలో ఎలాంటి పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
- మామిడిపండుః మామిడిపండు పుల్లగా ఉంటుంది. డయాబెటిస్‌లో దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ వారి ఊహ తప్పని పేర్కొంటున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులలో మామిడి వస్తుంది. చక్కెర స్థాయిని పెంచడానికి మామిడి పనిచేస్తుందని.. మధుమేహ బాధితులు దీనికి దూరంగా ఉండటమే మంచిదని పేర్కొంటున్నారు.
- పైనాపిల్ః పైనాపిల్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది డయాబెటిస్‌లో పైనాపిల్ జ్యూస్ తాగుతారు. అయితే ఇందులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు పైనాపిల్ తినడం వల్ల హాని కలుగుతుంది.
- అరటిపండుః పండిన అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వెంటనే చక్కెర స్థాయిని పెంచుతాయి. అందుకే షుగర్ బాధితులు అరటిపండుకు దూరంగా ఉండటం మంచిది.
- సపోటాః డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు సపోటా తినడం మంచిది కాదు. సపోటా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ రోగులు దీనిని తినకుండా ఉండాలని పేర్కొంటున్నారు.
- లీచి పండ్లుః లీచి పండ్లు చక్కెర స్థాయిని పెంచుతాయి. అధిక షుగర్ ఉన్న రోగులు లిచీ పండ్లను తినకూడదు. దీనివల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..