Telugu News » Photo gallery » Health Tips: Avoid these 6 Things That Can Damage Your Liver Damage
Liver Health: మీరు ఈ అలవాట్లను మానలేకపోతున్నారా..? జాగ్రత్త.. కాలేయంపై తీవ్ర ప్రభావం
Subhash Goud |
Updated on: Nov 29, 2022 | 8:54 PM
కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు కూడా పేరుకుపోతుంది. అలాంటప్పుడు ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతాయి..
Nov 29, 2022 | 8:54 PM
కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు కూడా పేరుకుపోతుంది. అలాంటప్పుడు ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారం కాలేయ ఆరోగ్యానికి ప్రధాన ఆందోళన. అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అలవాటును మానుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
1 / 6
అధిక ఆల్కహాల్ తీసుకోవడం కాలేయానికి హానికరం. ఎక్కువ మొత్తంలో చక్కెర తినడం వల్ల కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇటువంటి ఆహారాలు లివర్ సిర్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఆల్కహాల్, చక్కెర వినియోగం మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది.
2 / 6
జంక్ ఫుడ్ రుచికరంగా ఉన్నప్పటికీ ఇది శరీరంపై ముఖ్యంగా కాలేయంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు.
3 / 6
మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం ముఖ్యం. కానీ చాలామంది జిమ్‌కి వెళ్లేటప్పుడు సప్లిమెంట్ల సహాయం తీసుకుంటారు. నిపుణుల సలహా లేకుండా అధిక మొత్తంలో సప్లిమెంట్లను తీసుకోవద్దు తీసుకోవద్దు. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
4 / 6
కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ కూడా కాలేయ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ లేదా స్టెరాయిడ్ - కలిగిన మందులు దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలు దెబ్బతింటాయి. అందుకే వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు.
5 / 6
మీ రోజువారీ ఆహారం నుండి ప్రాసెస్ చేసిన ఆహారాలను తొలగించండి. బిస్కెట్లు, కుకీలు, మైదా, పేస్ట్రీలు, కేకులు, ఐస్ క్రీం, స్నాక్స్, చిప్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. బదులుగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తినండి.