Healthy Lungs: చలికాలంలో ఆరోగ్యం జరభద్రం.. ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం ఈ ఆహారాలు తీసుకోండి..

చలికాలం పెరిగే కొద్దీ కాలుష్య స్థాయి కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. కాలుష్యం కారణంగా ఎక్కువగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి.

Shaik Madar Saheb

|

Updated on: Nov 30, 2022 | 3:47 PM

Lungs

Lungs

1 / 6
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి ఆహారాలను ఎక్కువగా తినండి. ఇటువంటి పండ్లలో ఆంథోసైనిన్లు ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బెర్రీలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

2 / 6
పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ, క్యాప్సికమ్, బెల్ పెప్పర్, టొమాటో మొదలైన వివిధ కూరగాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా లభిస్తాయి. ఈ కూరగాయలలో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి, శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కాలానుగుణ కూరగాయలను పుష్కలంగా తినండి.

3 / 6
Orange

Orange

4 / 6
చలికాలంలో జామపండు తినాలి. ఈ సీజన్ లో పుష్కలంగా లభించే జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా జామపండును తినాలి. ఈ పండు ఊపిరితిత్తులకు మేలు చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది

5 / 6
శీతాకాలపు ఆహారంలో అల్లం, వెల్లుల్లి రెండింటినీ చేర్చుకోండి. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, వెల్లుల్లిలోని ఫ్లేవనాయిడ్స్ ఊపిరితిత్తులలో కాలుష్య కారకాలు చేరకుండా నిరోధిస్తాయి. ఈ రెండు మూలికలు వాపును తగ్గిస్తాయి. ఇంకా వాయుమార్గాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

6 / 6
Follow us