- Telugu News Photo Gallery Cricket photos From Sunil Gavaskar to Mohinder Amarnath these five oldest player hit a maiden century in odi career
Maiden ODI Hundred: లేటు వయసులో తొలి సెంచరీ సాధించిన దిగ్గజ ఆటగాళ్లు.. లిస్టులో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..
కెరీర్‌లో అత్యంత ఎక్కువ వయసులో తొలి వన్డే సెంచరీ చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 30, 2022 | 6:32 PM

ఏ ఫార్మాట్‌లోనైనా సెంచరీ చేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే, అన్ని పార్మాట్‌లలో సెంచరీలు చేయడం అంటే ఎంతో ప్రతిభ కావాలి. కాగా, ఇప్పటి వరకు ప్రతి ఫార్మాట్‌లో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. రోహిత్ శర్మ వంటి వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో సెంచరీలు సాధించారు. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును కలిగి ఉన్నాడు.

వన్డే క్రికెట్ గురించి మాట్లాడితే, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు సెంచరీ చేయడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అయినప్పటికీ, ఈ ఫార్మాట్‌లో అనేక సెంచరీలు సాధించలేకపోయిన కొంతమంది బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే వన్డేల్లో వీరు సెంచరీ చేసినా.. అత్యంత ఎక్కువ వయసులో చేయడం విశేషం. అయితే కెరీర్‌లో అత్యంత ఎక్కువ వయసులో తొలి వన్డే సెంచరీ చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత మాజీ వెటరన్ మోహిందర్ అమర్‌నాథ్ తన వన్డే కెరీర్‌లో 37 ఏళ్ల 117 రోజుల వయసులో తొలి సెంచరీని నమోదు చేశాడు. అతను తన మొదటి వన్డే సెంచరీని 19 జనవరి 1988న ఫరీదాబాద్‌లో వెస్టిండీస్‌పై చేశాడు. తన వన్డే కెరీర్‌లో కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు.

సునీల్ గవాస్కర్ ఒకప్పుడు టెస్టు క్రికెట్‌లో 34 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ వన్డేల్లో ఒకే ఒక్క సెంచరీ చేశాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను 31 అక్టోబర్ 1987న నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఏకైక సెంచరీని సాధించాడు. అతని మొదటి ODI సెంచరీ 38 సంవత్సరాల 113 రోజుల వయస్సులో చేశాడు.

బెర్ముడా మాజీ ఓపెనర్ డేవిడ్ హెంప్ కెన్యాపై 6 ఏప్రిల్ 2009న తన తొలి ODI సెంచరీని సాధించాడు. 38 ఏళ్ల 149 రోజుల వయసులో తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీ అతని కెరీర్‌లో ఏకైక సెంచరీగా నిలిచింది.

ఇంగ్లాండ్ మాజీ వెటరన్ జియోఫ్ బాయ్‌కాట్ తన ODI కెరీర్‌లో 39 సంవత్సరాల 51 రోజుల వయస్సులో మొదటి ODI సెంచరీని సాధించాడు. అతను తన కెరీర్‌లో మొదటి సెంచరీని 11 డిసెంబర్ 1979న సిడ్నీలో ఆస్ట్రేలియాపై సాధించాడు.

UAE ఆటగాడు ఖుర్రం ఖాన్ అత్యంత ఎక్కువ వయసులో వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 43 ఏళ్ల 162 రోజుల వయసులో కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ సాధించాడు. 2014లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఈ సెంచరీ సాధించాడు.





























