Vaccination for babies: మీ చిన్నారికి జ్వరం, జలుబు ఉన్నప్పటికీ టీకాలు వేయించవచ్చా.. వద్దా.. వైద్యులు ఏమంటున్నారంటే..
శిశువుకు టీకాలు వేయించడం చాలా ముఖ్యనది. టీకా సమయంలో శిశువుకు జ్వరం లేదా దగ్గు, జలుబు ఉంటే శిశువుకు టీకాలు వేయడం అవసరమా..?అనే ప్రశ్న అందరిలో వస్తుంది.

మీ చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించడం చాలా ముఖ్యం. చిన్న వయసులోనే వేయించే వ్యాక్సిన్లు పిల్లలను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పిల్లలు పుట్టిన వెంటనే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్లు వేయించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్లతో డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్, బీసీజీ, టీబీ,హెపిటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి, డయేరియా, మంప్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు. ముఖ్యంగా 12 వాక్సినేషన్లు అత్యంత కీలకం. చికెన్‌పాక్స్, డిఫ్తీరియా, టెటనస్, పెర్టూసిస్ వ్యాక్సీన్, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి వ్యాక్సీన్, ఇన్‌ఫ్లూయెంజా టీకా, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సీన్, బ్రెయిన్ ఫీవర్ టీకా, మీజిల్స్, మంప్స్ వ్యాక్సీన్, మెనింగోకోకల్ వ్యాక్సీన్, న్యూమోకోకల్ టీకాలను మరిచిపోకుండా పిల్లలకు ఇప్పించాలి. కానీ, కానీ కొన్నిసార్లు టీకా సమయంలో దగ్గు, జలుబు లేదా జ్వరం వస్తుంది. అటువంటి పరిస్థితిలో, శిశువుకు టీకాలు వేయడానికి తీసుకెళ్లాలా? వద్దా అనే డౌట్ చాలా మంది తల్లిదండ్రులకు వస్తుంది.
అయితే మీ బిడ్డకు దగ్గు, జలుబు, జ్వరం లేనట్లయితే.. మీరు పిల్లలకు టీకాలు వేయవచ్చు. సాధారణంగా తేలికపాటి జలుబు, దగ్గు కొన్ని రోజుల్లో దానంతటదే నయమవుతాయి. కానీ మీ బిడ్డకు జ్వరం, అనారోగ్యం ఉంటే ముందుగా మీరు వైద్యుడికి చూపించి, ఆపై అతని సలహాతో టీకాలు వేయించాలి. వైద్యులు పరీక్షించి ఆ తర్వాత మాత్రమే టీకాలు వేయాలా..? వద్దా..? అని డాక్టర్ చెబుతారు. పిల్లల వ్యాక్సిన్‌ను ఆలస్యం చేయాలా..? వద్దా..? అనేది శిశువు ఎంత అనారోగ్యంతో ఉన్నాడు. అతను పొందాల్సిన టీకా రకాన్ని బట్టి ఉంటుంది.
మీరు ఎంతకాలం టీకా వేయించాలి?
మీ పిల్లాడికి అధిక జ్వరం లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు.. అతని శరీరంలోని ప్రతిరోధకాలు సంక్రమణతో పోరాడడంలో బిజీగా ఉంటాయి. దీని నుంచి మీ పిల్లల శరీరం , రోగనిరోధక శక్తి ఒకే సమయంలో ఏ ఇతర ఇన్ఫెక్షన్‌తోనూ పోరాడలేవు.
ఏం చేయాలి..
తల్లిదండ్రులు వారి స్వంత నిర్ణయంతో తమ బిడ్డకు టీకాలు వేయడాన్ని ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు . శిశువు కోలుకున్న తర్వాత టీకా తీసుకోవచ్చని డాక్టర్ సలహా ఇస్తే.. అలా మాత్రమే ఆలస్యంగా వేయించండి.
టీకా ఎప్పుడు అవసరం
టీకాలు వేసే సమయం చాలా ముఖ్యం. పిల్లవాడికి ఎంత త్వరగా టీకాలు వేస్తే, అతను టీకాలు వేసిన వ్యాధి నుంచి త్వరగా రక్షించబడతాడు. సాధారణంగా, మితమైన లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, జ్వరంతో లేదా లేకుండా వారు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకాలు వేయవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం