- Telugu News Health Place these plants in your home or balcony to avoid Mosquitoes and deceases caused by them
Mosquitoes: దోమలతో విసుగెత్తిపోయారాా..? వాటిని మీ దరిదాపులకు రాకుండా ఉంచేందుకు ఈ మొక్కలను నాటండి..
దోమల బెడద కారణంగా ఏటా వేలాది మంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంకా ఈ వ్యాధి కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ ఇళ్లలో దోమల నివారణకు..
శివలీల గోపి తుల్వా | Edited By: Janardhan Veluru
Updated on: Dec 01, 2022 | 2:27 PM

దోమల బెడద కారణంగా ఏటా వేలాది మంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంకా ఈ వ్యాధి కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ ఇళ్లలో దోమల నివారణకు వివిధ రకాల మందులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ, దోమల సమస్య పరిష్కారం కాదు. అయితే ఇక ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లోని ఔషధ మొక్కలు నాటడం ద్వారా దోమలను దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల సువాసనలును వెదజల్లే ఈ మొక్కలు సహజంగానే దోమలకు వికర్షకాలుగా పనిచేస్తాయి. తద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. మరి ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

మేరిగోల్డ్ ప్లాంట్: మేరిగోల్డ్ మొక్క అలంకారమైన పూల మొక్క మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాలలో బంతిపూల మొక్కగా పిలుచుకునే ఈ మొక్క దోమల పాలిట సహజమైన వికర్షకంగా పనిచేస్తుంది. చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్క పూలు ప్రత్యేకమైన సువాసనలను వెదజల్లుతాయి. దోమలు దాని దగ్గరికి రావడానికి భయపడటానికి కారణం ఆ సువాసనలే.. ఎందుకంటే ఆ సువాసనలకు దోమలను చంపగలిగే శక్తి ఉంటుంది. మీరు ఈ మొక్కను మీ ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో లేదా టెర్రస్ ప్రాంతంలో నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు రావు.

తులసి మొక్క: హిందూమతంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకుల రసం జలుబు, దగ్గు సమస్యలకు పరిష్కారంగా పని చేస్తుంది. దీనితో పాటు దోమలను తరిమికొట్టడంలో కూడా తులసి మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఇంట్లోనే ఎక్కడైనా నాటుకోవచ్చు.

లావెండర్ మొక్క: దోమలను తరిమికొట్టడానికి ఉపయోగించే దోమల వికర్షకాలలో లావెండర్ ఆయిల్‌ను కలుపుతారు. లావెండర్ ప్లాంట్ దోమలను తరిమికొట్టడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా ఎక్కడైనా పెంచుకోవచ్చు.

పుదీనా మొక్క: పుదీనా సువాసనకు దోమలను తరిమికొట్టే శక్తి ఉంది. దాని ఆకుల నుంచి వెలువడే ఘాటైన వాసన దోమలతో పాటు ఇతర కీటకాలను కూడా దూరం చేస్తుంది. పుదీనాను కుండీలలో పెంచవచ్చు ఇంకా దీనికి తేమతో కూడిన నేల, మంచి పారుదల అవసరం. ఇంట్లో లేదా పెరట్లో ఈ మొక్కను నాటుకోవచ్చు. పూదీనాను వంటలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.

రోజ్మేరీ మొక్క: రోజ్మేరీ మొక్క ఇంకా దాని పూలు చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటి అందం పెరుగుతుంది. దీనితో పాటు, రోజ్మేరీ మొక్కను సహజ దోమల వికర్షకాలుగా పరిగణిస్తారు. ఇది దోమలను తరిమికొడుతుంది.





























