ప్రతి వ్యక్తి తాను తీసుకునే అల్పాహారం, భోజనం, రాత్రి భోజనానికి నిర్ధిష్ట సమయాన్ని కలిగి ఉండాలి. ఆహారం తీసుకోవడంలో ఒక షెడ్యూల్‌ను పెట్టుకుని పాటించకపోతే అనేక తీవ్రమైన వ్యాధులు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన సమయానికి భోజనం చేస్తే శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది.