- Telugu News Photo Gallery Technology photos Experts say that some tricks should be followed to get likes and followers on Instagram
Instagram: మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారా.. డోంట్ వర్రీ.. ఈ ట్రిక్ ను ఫాలో అవ్వండి..
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. సెలబ్రిటీల అకౌంట్ ఓపెన్ చేస్తే ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది.
Updated on: Dec 01, 2022 | 12:11 PM

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. సెలబ్రిటీల అకౌంట్ ఓపెన్ చేస్తే ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫోటోగ్రఫీ, రీల్స్ చేసే వారికే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే చాలా మంది తమను ఎవరూ ఫాలో అవడం లేదని, లైక్ చేయడం లేదని బాధ పడుతూ ఉంటారు.

అయితే ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి అనేక థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఒకటి GetInsta. ఈ యాప్‌ని ఉపయోగించి ఫాలోవర్లను పెంచుకోవచ్చు.

అలాగే, మీరు మీ పోస్ట్‌లకు మరిన్ని లైక్‌లను పొందవచ్చు. ఫాలోవర్స్ గ్యాలరీ అనే మరో యాప్ ఉంది. ఇది ఉచిత యాప్. దీన్ని ఉపయోగించడానికి ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. www.Skfollowerspro.in, https://locationary.org వెబ్‌సైట్‌ల ద్వారా అనుచరులను పొందవచ్చు.

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, బ్లాగింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సెర్చ్ మీడియా ఆప్టిమైజేషన్ మొదలైనవి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచడంలో సహాయపడతాయి. థర్డ్ పార్టీ యాప్ ద్వారానే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కొన్ని ట్రిక్స్ ద్వారా ఫాలోవర్లను పెంచుకోవచ్చు.

ఏదైనా ఫోటోలు, రీల్‌లను షేర్ చేయడానికి ముందు పోస్ట్‌లో టైటిల్ తర్వాత హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తే ఆ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ పోస్ట్‌లలో కనిపిస్తుంది. ఫోటో లేదా రీల్‌ను పోస్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చే క్యాప్షన్ అనుచరులను పెంచుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తులు క్యాప్షన్ లేకుండా వారి పోస్ట్‌లకు ఎక్కువ లైక్‌లను పొందుతారు.

ఫాలోవర్లను పెంచుకోవడానికి, ఫాంట్‌లను స్టైలిష్‌గా మార్చడానికి, లైక్‌లు పొందడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించడానికి అనేక థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అయితే, ఇది పూర్తిగా సురక్షితం అని చెప్పలేము. ఇలాంటి యాప్స్‌కి జనం మళ్లిపోతారని తెలిసి హ్యాకర్లు నకిలీ యాప్‌లను సృష్టించారు. దీని గురించి జాగ్రత్త వహించాలి.




