AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dental Health: తళతళ మెరిసిపోవాలని పళ్లను గట్టిగా తోముతున్నారా.. అలా చేస్తే సమస్యలు తప్పవు.. బీ ఆలర్ట్

ఉదయం నిద్ర లేవగానే మనం చేసే మొట్టమొదటి పని బ్రష్ చేసుకోవడం.. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది సామెత. కానీ నోరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం..

Dental Health: తళతళ మెరిసిపోవాలని పళ్లను గట్టిగా తోముతున్నారా.. అలా చేస్తే సమస్యలు తప్పవు.. బీ ఆలర్ట్
Brushing
Ganesh Mudavath
|

Updated on: Dec 06, 2022 | 7:50 PM

Share

ఉదయం నిద్ర లేవగానే మనం చేసే మొట్టమొదటి పని బ్రష్ చేసుకోవడం.. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది సామెత. కానీ నోరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రష్‌ పై పేస్ట్‌ వేసుకుని, పళ్లను రుద్దడం చాలా మంది చేసే పని. ఇలా చేస్తేనే దంతాలు తళతళా మెరుస్తాయని అనుకుంటారు. కానీ అలా రుద్దడం వద్ద దంత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రష్ తో పళ్లను గట్టిగా రుద్దుకోవడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. అయితే పళ్ళను గట్టిగా తోమడం వల్ల ఎనామిల్ పొర మాత్రమే కాకుండా.. అతి జాగ్రత్త, అపోహలు ముప్పు తెచ్చిపెడుతాయని చెబుతున్నారు. రోజులో ఒక్కసారి పళ్లు తోముకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. మరి కొంతమందేమో ఉదయం, సాయంత్రం రెండుసార్లు బ్రష్‌ చేసుకుంటారు. నిజానికి ఇలా రెండుసార్లు బ్రష్‌ చేసుకోవడమే చాలా మంచిది.

బ్రష్‌కి ఉండే గరుకైన బ్రిజిల్స్‌ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్‌ పొర తొలగిపోతుంది. అలాగని మరీ మృదువైన బ్రిజిల్స్‌ ఉండే బ్రష్‌ ఉపయోగించకూడదు. కాబట్టి మీడియం టూత్‌బ్రష్‌ ను ఎంచుకోవాలి. పళ్ల సందుల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రష్‌ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుందని, పళ్ల మధ్య ఉండిపోయిన ఆహార పదార్థాలను తొలగించుకోవచ్చు. అలాగని బ్రషింగ్‌కి బదులుగా మౌత్‌ వాష్‌తో పుక్కిలించడం సరైన పద్ధతి కాదు. అందుకే మౌత్‌వాష్‌ను ఎలా వాడాలో, ఎంత వాడాలో నిపుణులను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కానీ చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది అస్సలు సరికాదు. కాబట్టి సమస్య ముదిరాక బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్తపడాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకోసారైనా డెంటిస్ట్‌ని సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. దంతాల్ని శుభ్రం చేయించుకుంటే వాటిపై పేరుకున్న పాచి తొలగిపోయి.. అవి మరింత శుభ్రపడతాయని, తద్వారా నోటి ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..