Cabbage Benefits: క్యాబేజీ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తెలిస్తే మీరు దానిని వదిలిపెట్టరంతే..

క్యాబేజీని తరచూగా అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా నూడుల్స్, మాకరోనీ వంటి వాటికి కలుపుతారు. ఏ వంటకం రుచిని అయినా పెంచడంలో క్యాబేజీ

Cabbage Benefits: క్యాబేజీ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తెలిస్తే మీరు దానిని వదిలిపెట్టరంతే..
Cabbage
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 06, 2022 | 9:19 PM

క్యాబేజీని తరచూగా అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా నూడుల్స్, మాకరోనీ వంటి వాటికి కలుపుతారు. ఏ వంటకం రుచిని అయినా పెంచడంలో క్యాబేజీ  ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో అనేక విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. క్యాబేజీని  తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి. క్యాబేజీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

క్యాబేజీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చని రంగులో ఉండే క్యాబేజీని మార్కెట్లో సులభంగా కనిపెట్టవచ్చు. క్యాబేజీలోని ప్రతి రకం మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది.

మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకారి:

క్యాబేజీ మధుమేహం సమస్యతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లక్షణాలు ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. క్యాబేజీని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెరుగైన జీర్ణక్రియ:

క్యాబేజీ జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. క్యాబేజీలో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాబేజీలో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడతాయి.

గుండెకు మేలు:

క్యాబేజీ మన గుండెకు కూడా మేలు చేస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. క్యాబేజీని తీసుకోవడం వల్ల గుండె ఒత్తిడి తగ్గుతుంది ఇంకా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉదర సమస్యల నుంచి ఉపశమనం:

క్యాబేజీ ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ జీర్ణశక్తిని పెంచి కడుపు నొప్పిని దూరం చేస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది.

కండరాల నొప్పుల నుంచి ఉపశమనం:

కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే.. క్యాబేజీ మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారణిగా పని చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..