Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glycerin on Face: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం గ్లిజరిన్‌ను వాడుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలును పాటించడం మర్చిపోకండి..

చలికాలంలో మనం చర్మ సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు, ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ క్రమంలోనే క్రీములు, నూనెలు, మాయిశ్చరైజర్లు శీతాకాలంలో మన రోజువారీ సహచరులుగా అయిపోయాయి. అయినప్పటికీ.. మన శరీరం..

Glycerin on Face: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం గ్లిజరిన్‌ను వాడుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలును పాటించడం మర్చిపోకండి..
Winter Skin Care
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 08, 2022 | 7:36 PM

చలికాలంలో మనం చర్మ సంరక్షణ కోసం అనేక జాగ్రత్తలు, ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ క్రమంలోనే క్రీములు, నూనెలు, మాయిశ్చరైజర్లు శీతాకాలంలో మన రోజువారీ సహచరులుగా అయిపోయాయి. అయినప్పటికీ మన శరీరం చలికాలంలో తేలికగా పొడిబారిపోతుంది. అంతేకాక నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో చర్మ సంరక్షణ తప్పనిసరి అయింది. ఈ రోజుల్లో చర్మాన్ని సంరక్షించే అనేక రకాల కాస్మెటిక్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒకప్పుడు చలికాలంలో మన తల్లులు, అమ్మమ్మలు గ్లిజరిన్‌పైనే ఆధారపడేవారు. ఈ రంగులేని, వాసన లేని సహజ ఔషధం శీతాకాలంలో మన చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ ఇప్పుడు కె-బ్యూటీ లేదా ఇతర కాస్మెటిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గ్లిజరిన్ కనుమరుగవుతోంది. అయితే శీతాకాలపు మాయిశ్చరైజర్లను తయారు చేసేందుకు గ్లిజరిన్ కూడా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియకపోవచ్చు.

మీరు వాడే మాయిశ్చరైజర్లలో కూడా గ్లిజరిన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇతర రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి..?వాటికి బదులుగా ఈ శీతాకాలంలో మీ చర్మంపై నేరుగా గ్లిజరిన్ ఉపయోగించండి. గ్లిజరిన్ ఒక సహజ ఔషధం. ఇది చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలను చూయించదు. గ్లిజరిన్‌లో ట్రై-హైడ్రాక్సీ ఆల్కహాల్ ఉంటుంది. అందువల్ల ఇది ఏ రకమైన చర్మానికైనా బాగా పని చేస్తుంది. అయితే చర్మాన్ని మృదువుగా ఉంచే విషయంలో గ్లిజరిన్ నేరుగా ఉపయోగించవచ్చా..? లేదా..? గ్లిజరిన్ వాడే విషయంలో పాటించాల్సిన నియమం ఏమైనా ఉందా..? ఆ వివరాలను మనం తెలుసుకుందాం..

1) చర్మంపై నేరుగా గ్లిజరిన్ ఉపయోగించకపోవడమే మంచిది. బదులుగా రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి రాసుకోవచ్చు. మీరు గ్లిజరిన్‌తో కలిపిన అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

2) గ్లిజరిన్ ఉపయోగించే ముందు చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోండి. చర్మాన్ని శుభ్రం చేయడానికి తేలికపాటి ఫేస్ వాష్‌లను ఉపయోగించండి.

3) గ్లిజరిన్ ఫేస్ ప్యాక్ ఉపయోగించిన తర్వాత గోరువెచ్చని నీటితోనే కడగండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

4) జిడ్డు చర్మం ఉన్నవారు కూడా గ్లిజరిన్ ఉపయోగించవచ్చు. ఒక చెంచా గ్లిజరిన్‌తో ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకోవచ్చు.

5) మీకు పొడి చర్మం ఉన్నట్లయితే ఒక చెంచా పచ్చి పాలలో, ఒక చెంచా గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

6) గ్లిజరిన్‌ను మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు గ్లిజరిన్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..