Reduce Obesity: ఊబకాయంతో బాధపడుతున్నారా..? మీ సమస్యకు పరిష్కారం ఉంది.. అయితే..
ఈ రోజుల్లో చాలా మంది చిన్నవయసులోనే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే మన శరీరంలోని అనేక వ్యాధులకు ఊబకాయమే కారణమని మనం గుర్తించాలి. అధిక స్థూలకాయం వల్ల.. మధుమేహం, కీళ్లనొప్పులు
ఈ రోజుల్లో చాలా మంది చిన్నవయసులోనే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే మన శరీరంలోని అనేక వ్యాధులకు ఊబకాయమే కారణమని మనం గుర్తించాలి. ఊబకాయానికి ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవనశైలి కారణమైనప్పటికీ అధిక స్థూలకాయం వల్ల మధుమేహం, కీళ్లనొప్పులు, హైపర్ టెన్షన్ వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి యోగా, వర్కవుట్లే కాకుండా అనేక రకాల వ్యాయామాలు కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో మనం సాధించిన పురోగతి ఊడకాయాన్ని నివారించగలుగుతోది. మానవులకు సాధ్యం కానిది ఏదీ లేదు కదా.. శస్త్రచికిత్స సహాయంతో కూడా ఊబకాయాన్ని తగ్గించవచ్చు. కానీ ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల కొన్ని రకాల ప్రమాదాలు కూడా సంభంవించే అవకాశం ఉంది.
శస్త్రచికిత్సతో సన్నబడటం..
వైద్య రంగంలో మానవుడు ఎంతగానో పురోగతిని సాధించాడు. ఆ క్రమంలోనే వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా స్థూలకాయులను స్లిమ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఆపరేషన్. లాపరోస్కోపిక్ ద్వారా కడుపు, ప్రేగుల ఆపరేషన్ జరుగుతుంది. ఈ శస్త్రచికిత్సలో స్థూలకాయంతో బాధపడే వ్యక్తి కడుపును చిన్నదిగా చేస్తారు. ఈ కారణంగా సదరు వ్యక్తి తక్కువ ఆహారం తీసుకుంటాడు. అయితే వైద్యులు చాలా సందర్భాలలో ఈ శస్త్రచికిత్సను సిఫారసు చేయరు. యోగా, వర్కవుట్, వ్యాయామం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు పదే పదే సూచిస్తారు. ఈ సూచనలను పాటించిన తర్వాత ప్రయోజనం లేకుంటే వైద్యులు శస్త్రచికిత్సను ఆశ్రయిస్తారు.
బేరియాట్రిక్ సర్జరీ లాభనష్టాలు..
బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి ప్రతి నెలా 6 నుంచి 8 కిలోల బరువు తగ్గడం ప్రారంభిస్తాడు. బరువు సరిగ్గా ఉంటే నిద్ర రుగ్మతలు, టైప్ 2 మధుమేహం కలిగే అవకాశం ఉంది. అంతేకాక రక్తపోటు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
బేరియాట్రిక్ సర్జరీకి ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. డాక్టర్ సరైన విధంగా ఆపరేషన్ చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. ఇలా అనేక సందర్భాలలో జరిగింది. ఎందుకంటే ఈ సర్జరీ గురించి చాలా మంది డాక్టర్లకు సరైన అవగాహన లేదు. కాబట్టి సర్జరీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరగవచ్చు.
ఖర్చు ఎంత అవుతుందంటే..
కొంతమంది బేరియాట్రిక్ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుందని భావిస్తారు. అయితే వాస్తవానికి ఇది చాలా ఖరీదైన సర్జరీ. ఈ సర్జరీ చేయించుకోండానికి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..