AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఆకుపచ్చని రంగులో, తియ్యని గుజ్జుతో.. చూడగానే నోరూరించే సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఫలం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

Health: గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారంటే..
Custard Apple
Ganesh Mudavath
|

Updated on: Dec 08, 2022 | 3:45 PM

Share
ఆకుపచ్చని రంగులో, తియ్యని గుజ్జుతో.. చూడగానే నోరూరించే సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఫలం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు రుచిలోనే కాదు.. పోషకాల పరంగానూ హైలైట్ అనే చెప్పాలి. సీతాఫలంలో విటమిన్ సీ తోపాటు ఏ, బీ, కే విటమిన్లు, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం,  ఐరన్‌ అధికంగా ఉంటాయి. సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. బ్రేక్ ఫాస్ట్ కు బదులు వీటిని తింటే కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తొలగించి రక్తసరఫరా బాగా అయ్యేలా సహకరిస్తుంది. విటమిన్‌ ఏ కంటి చూపును మరింతగా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మం,జుట్టును ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే ఐరన్.. ఐరన్‌ లోపాన్ని దూరం చేసి, హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అనీమియాతో బాధపడేవారు ఈ పండు తింటే మంచిది.
   సీతాఫలంలో ఆల్కలాయిడ్స్, ఎసిటోజెనిన్ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి. మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు సీతాఫలం తింటే మంచిది. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బీ6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, చికాకు వంటివి ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈ సమస్యలను దూరం చేస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిది.
  గర్భిణీ స్త్రీలకు సీతాఫలం చాలా మంచిది. వీటిని డైట్ లో భాగం చేసుకుంటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఈ పండులోని ఫైబర్‌ – గర్భిణుల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు – వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది. ఆర్థరైటిస్, రుమాటిజం లక్షణాలను తగ్గిస్తుంది. సీతాఫలంలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..