Beauty Tips: సారా అలీ ఖాన్ అందం వెనుక రహాస్యం ఇదేనా..? తెలిస్తే వెంటనే వాటి కోసం మీ వంటగదిలోకి వెళ్లకుండా ఉండలేరు..

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి అందరికి బాగా తెలుసు. ఇంకా చెప్పుకోవాలంటే.. నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురుగా కంటే తన అందం అభినయాల ద్వారానే చాలా మంది యువతకు ఇష్టమైన నటి సారా. సారా సహాజంగానే..

Beauty Tips: సారా అలీ ఖాన్ అందం వెనుక రహాస్యం ఇదేనా..? తెలిస్తే వెంటనే వాటి కోసం మీ వంటగదిలోకి వెళ్లకుండా ఉండలేరు..
Sara Ali Khan
Follow us

|

Updated on: Dec 08, 2022 | 4:11 PM

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి అందరికి బాగా తెలుసు. ఇంకా చెప్పుకోవాలంటే.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురుగా కంటే తన అందం అభినయాల ద్వారానే చాలా మంది యువతకు ఇష్టమైన నటి సారా. సారా సహాజంగానే అందంగా ఉంటుంది. ఒకప్పుడు సారా తల్లి అమృతా సింగ్ అందాలకు సినీ ప్రపంచమంతా పిచ్చెక్కిపోయేది. ఇప్పుడు సారా అలీ ఖాన్ అందంతో యువతను పిచ్చెక్కిస్తోంది. అయితే సారా అలీ ఖాన్ అంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి..? ఆ అందం రహస్యం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా..? సారా స్వయంగా తన అందానికి గల రహస్యం ఏమిటో, అందు కోసం తాను పాటించే విధానాలేమిటో తెలియజేసింది. తన తల్లి నుంచి తరచుగా చర్మం, ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన హోం రెమెడీస్ నేర్చుకుంటానని సారా చెబుతోంది. అయితే అవేమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..

ముఖానికి ఉల్లిపాయ

నటి సారా అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తన అందానికి ఉల్లిపాయ ఒక రహస్యం అని చెప్ప్రింది. ఓ సారి తన జుట్టు మీద ఉల్లిపాయ రసాన్ని పూసానని.. ఆ సమయంలోనే చర్మంపై కూడా ఉపయోగించనని తెలిపింది. అయితే మరో ఇంటర్వ్యూలో బ్యూటీ కేర్‌కు సంబంధించిన ప్రశ్న గురించి సారా మాట్లాడుతూ.. ఉల్లిపాయ చర్మానికి, జుట్టుకు ఎందుకు చాలా మంచిదనే విషయం చెప్పింది.

ఉల్లిపాయతో  చర్మానికి, జుట్టుకు మేలు.

ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం గురించి ఇది వరకే మీరు విని ఉంటారు. మనలో చాలా మంది దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఉల్లిని కేవలం హోం రెమెడీస్‌కే కాదు, ఇప్పుడు ఆనియన్ షాంపూలా కూడా మార్కెట్‌లో దొరుకుతోంది. ఉల్లిపాయ జుట్టుకు, చర్మానికి గొప్ప హెర్బల్ ఫుడ్. ఉల్లిపాయ మాస్క్ మన చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మీ చర్మం చికాకు పడకుండా ఉండాలంటే ఉల్లిపాయ మాస్క్‌ను ఉపయోగించండి. ఉల్లిపాయ మాస్క్‌ను ఎలా తయారుచేయాలంటే..

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ మాస్క్..

  • ఉల్లిపాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి.
  • అందులో ఒకటిన్నర టీస్పూన్‌ ఉల్లిపాయ రసాన్ని తీసుకొని.. అందులో ఒక్కొక్క చెంచా నిమ్మరసం, తేనె కలపండి.
  • తర్వాత అందులో ఒకటి, ఒకటిన్నర చెంచా శనగ పిండిని కలపాలి.
  • అన్నింటినీ కలిపిన తర్వాత దానిని పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని కొద్దిగా ముఖంపై మాస్క్‌లా రాయండి.
  • ఈ మాస్క్‌ను అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగండి. మీరు ఇలా ఉల్లిపాయ ఫేస్ మాస్క్‌ను వారానికి 2, 3 సార్లు ఉపయోగించవచ్చు.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..