Alert: అమ్మాయిలూ అలర్ట్.. ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. కాదంటే మీ అందం దెబ్బతింటుంది..

ఇంట్లో గానీ, బంధువుల ఇళ్లలో గానీ ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే.. అమ్మాయిలు మేకప్ వేసుకుని, అందంగా, స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేలా రెడీ అవుతారు. ఇక ఒక అమ్మాయి జీవితంలో ముఖ్యమైన సందర్భాలు రెండుంటాయి.

Alert: అమ్మాయిలూ అలర్ట్.. ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. కాదంటే మీ అందం దెబ్బతింటుంది..
Beauty Tips For Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 08, 2022 | 6:00 PM

ఇంట్లో గానీ, బంధువుల ఇళ్లలో గానీ ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే.. అమ్మాయిలు మేకప్ వేసుకుని, అందంగా, స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేలా రెడీ అవుతారు. ఇక ఒక అమ్మాయి జీవితంలో ముఖ్యమైన సందర్భాలు రెండుంటాయి. అవి నిశ్చితార్థం, వివాహం. ఒకరి జీవిత భాగస్వామిగా అఫిషియల్‌గా మారడానికి మొదటి అడుగు నిశ్చితార్థం. అందుకే అమ్మాయిలకు ఇది చాలా స్పెషల్. ఈ సందర్భంగా అమ్మాయిలు అందంగా కనిపించేలా ముస్తాబవుతుంటారు. అయితే, కొందరు అమ్మాయిలు నిశ్చితార్థం వేళ కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా వారు నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వారు పొరపాట్ల కరానంగా లుక్ పాడైపోతుంది. ఇలా జరుగకుండా ఉండేందుకు ఇవాళ మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. వాటిని జాగ్రత్తగా పాటించడం ద్వారా నిశ్చితార్థం వేళ అందంగా కనిపించొచ్చు.

అదే రోజు ఫేషియల్ చేయించుకోవద్దు..

ఏదైనా ప్రత్యేక ఫంక్షన్‌ ఉన్నట్లయితే.. రెండు మూడు రోజుల ముందే ఫేషియల్ చేయించాలి. డీప్ క్లీనింగ్ కారణంగా ముఖంపై మొటిమలు, ఎరుపు దద్దుర్లు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల ముందే ఫేషియల్ చేయించుకోవడం వల్ల ఫంక్షన్ టైమ్‌కి ముఖం సాధారణ స్థితికి చేరుతుంది. అదే రోజు ఫేషియల్ చేయించుకుంటే.. ముఖంపై మచ్చలు, మొటిమలు, దద్దుర్లు కనిపిస్తాయి.

ప్రయోగాలు వద్దు..

చాలా మంది హోమ్ రెమిడీస్‌ ప్రయోగాలు చేస్తారు. కానీ, అలా చేయొద్దు. ఫంక్షన్ రోజున వంటింటి చిట్కాలు అస్సలు ప్రయత్నించొద్దు. ఏదైనా ప్రతిచర్య జరిగితే.. దాని ప్రభావం ముఖంపై చాలా స్పష్టం కనిపిస్తుంది. మేకప్ వేసుకున్నా.. ఫలితం ఉండదు.

ఇవి కూడా చదవండి

కొత్త మేకప్ ప్రోడక్స్ వాడొద్దు..

స్పెషల్ అకేషన్ అని చాలా ప్రత్యేకంగా ఉండేందుకు అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల ముఖారవిందం పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే మొదటి నుంచి ఉపయోగిస్తున్న స్కిన్ టోన్ ఫౌండేషన్ మొదలైన ప్రోడక్ట్స్‌నే వాడాలి. లేదంటే.. స్కిన్ టోన్‌లో తేడాలు కనిపిస్తాయి.

అలంకరణ..

నటీనటుల శరీరం, ముఖం ఒకే టోన్‌లో ఉండటానికి కారణం.. ముఖానికి వేసే మేకప్‌ను శరీరానికి కూడా వేస్తారు. దాని కారణంగానే ముఖం, మెడ, చేతులు, ఇలా శరీరం అంతా ఒకే టోన్‌లో కనిపిస్తుంటుంది. మేకప్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

హెయిర్ స్టైల్..

మీరు ధరించే డ్రెస్, ఈవెంట్ ప్రకారం హెయిల్ స్టైల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అయితే, చాలా మంది సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్‌ని ఫాలో అవుతుంటారు. అలా చేయొద్దు. హెయిర్ స్టైల్ స్టైలీష్‌గా ఉండటమే కాకుండా.. మీ ముఖానికి కూడా సూట్ అయ్యే విధంగా సెట్ చేయించుకోవాలి. లేదంటే.. ముఖానికి, హెయిర్ స్టైల్‌కి మధ్య చాలా తేడా కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..