Mandous Cyclone Update: ముంచుకొస్తున్న ‘మాండూస్’.. దీని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉంటుందంటే..?

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండూస్’ తుఫాను తన పరిధిని క్రమక్రమంగా పెంచుకుంటూ బలంగా తీరప్రాంతాలవైపు దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో దాదాపు 11 కి.మీ వేగంతో.. పశ్చిమ వాయువ్య దిశగా

Mandous Cyclone Update: ముంచుకొస్తున్న ‘మాండూస్’.. దీని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉంటుందంటే..?
Mandous Cyclone
Follow us

|

Updated on: Dec 08, 2022 | 3:03 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండూస్’ తుఫాను తన పరిధిని క్రమక్రమంగా పెంచుకుంటూ బలంగా తీరప్రాంతాలవైపు దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో దాదాపు 11 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాన్ ఈ రోజు(గురువారం) ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ.. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ.. కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ.. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మధ్య డిసెంబర్ 9 అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఇంకా పుదుచ్చేరి, శ్రీహరికోట వద్ద దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుంచి 75 కి మీ గరిష్టంగా 85 కి మీ వేగంతో తుఫాను గాలులు వీచే అవకాశం ఉంటుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు..

ఉత్తరాంధ్ర :-

ఈ రోజు, రేపు, ఎల్లుండి..

ఇవి కూడా చదవండి

ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

దక్షిణాంధ్ర :-

ఈ రోజు..

ఈ రోజు దక్షిణాంధ్రలోని  కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి మీ గరిష్టం గా 60 కి మీ వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు.

రేపు, ఎల్లుండి..

ఈ రోజు దక్షిణాంధ్రలోని  కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.ప్రకాశం, బాపట్ల జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవవచ్చు. ఈదురు గాలులు గంటకు 65 -75 కి మీ గరిష్టం గా 85 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈ రోజు..

కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తిరుపతి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ గరిష్టం గా 60 కి మీ వేగంతో వీయవచ్చు.

రేపు..

కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 65 -75 కి మీ గరిష్టం గా 85 కి మీ వేగంతో వీయవచ్చు

ఎల్లుండి..

కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.  సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైస్సార్ కడప జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 55 -65 కి మీ గరిష్టం గా 75 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..