AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shuttlecock: వాయమ్మో ఇదేం వింత గురూ.. గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా

గాల్లో ఉండిపోయిన కాక్.. షటిల్ బ్యాట్ విరిసి కొట్టటంతో కిందపడిందట. కొన్ని నిమిషాలు పాటు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఆగి కాక్ విన్యాసం చేసిందట. ఈ ఘటన చూసి అక్కడి జనాలు నివ్వెరపోయారు.

Shuttlecock: వాయమ్మో ఇదేం వింత గురూ.. గాల్లోనే ఆగిపోయిన షటిల్ కాక్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా
Shuttle Cock Stuck In Air
Ram Naramaneni
|

Updated on: Dec 08, 2022 | 2:52 PM

Share

ఈ భూమ్మీద మనుషులు నిలబడుతున్నారన్నా.. పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్నామన్నా.. కారణం గురుత్వాకర్షణ శక్తి. దీన్ని భూమ్యాకర్షణ శక్తి అని కూడా అంటారు. అదేనండీ.. ఇంగ్లీషులో గ్రావిటీ అని పిలుస్తారు. న్యూటన్ చెప్పిన  ఈ థియరీని చిన్నప్పుడే  అందరూ చదువకుని అంటారు. చెట్టు నుంచి యాపిల్‌ కిందపడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్‌ కనిపెట్టాడు. కానీ ఏదైనా వస్తువును ఆకాశంలోకి విసిరినప్పుడు అలానే అది పైన ఉండిపోతే.. అయ్య బాబోయ్ అలా జరిగితే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అయితే అలాంటి ఓ విచిత్ర ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది.

నవరం మండలం టేకులబోరు బీసీ కాలనీలో కొంతమంది చిన్నారులు బుధవారం సాయంత్రం  షటిల్ ఆడుతుండగా.. మధ్యలో ఒక్కసారిగా కాక్ గాల్లోనే ఉండిపోయింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా కాక్ అలా ఉండటంతో పిల్లలు ఆశ్చర్యానికి లోనయ్యారు. కొద్ది నిమిషాల కాక్  అలానే ఉండిపోయిందని.. ఆ తర్వాత షటిల్ బ్యాట్ పైకి విసరడంతో అది కిందపడిందని ఆ కిడ్స్ చెబుతున్నారు. ఈ వింత ఘటనను వారు ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ఇదేలా సాధ్యం అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.

దీనిపై భిన్న వాదన చేసేవారు కూడా ఉన్నారు. అక్కడి కరెంట్ తీగకు సాలెపురుగు గూడు పెట్టిందని.. ఆ గూడులో కాక్ చిక్కుకుందని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే ఈ వీడియో ఫేక్ అని.. కేవలం వైరల్ చేసేందుకు వీడియోను అలా క్రియేట్ చేశారని చెప్పుకొస్తున్నారు. మరి అసలు విషయం ఏంటి అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..