Diabetes: మీరు మధుమేహంతో బాధపడుతున్నారా..? అయితే ఈ నాలుగు రకాల ఆకుల గురించి తప్పక తెలుసుకోండి..
మనం చేయగలిగిందల్లా ఈ సమస్యను మన అధీనంలోకి తెచ్చుకోవడమే. అంతకంటే మరో మార్గం లేదు. అందుకోసం మధుమేహంతో బాధపడేవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక.. లేకపోతే..
ఈ రోజుల్లో మధుమేహం(డయాబెటిస్) సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఈ సమస్య కారణంగా ఏం తినాలన్నా, తాగాలన్నా ఆలోచించక తప్పటంలేదు. ఈ సమస్య ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం దానితో బాధపడవలసిందే. ఎందుకంటే ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు కూడా దీనికి సరైన చికిత్సను కనుగొనలేకపోయారు. ఇక మనం చేయగలిగిందల్లా ఈ సమస్యను మన అధీనంలోకి తెచ్చుకోవడమే. అంతకంటే మరో మార్గం లేదు. అందుకోసం మధుమేహంతో బాధపడేవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు. అలా బాధపడేవారు తమ ఆహారంలోకి కొన్ని రకాల ఆకులను చేరిస్తే చాలు. సమస్యను తమ అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కరివేపాకు: మధుమేహంతో బాధపడేవారు తమ ఆహారంలో భాగంగా కరివేపాకులను ఉపయోగించవచ్చు. కరివేపాకులను సాధారణంగా దక్షిణ భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే అవి డయాబెటిక్ రోగులకు వరం కంటే తక్కువేం కాదు. కరివేపాకు ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేసి మధుమేహ రోగులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
మెంతి ఆకులు: మెంతి ఆకులను సాధారణంగా పరాఠాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉండడమే కాక డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. మెంతి ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిని చాలా వరకు తగ్గిస్తాయి.
మామిడి ఆకులు: మామిడి పండ్లను అందరూ ఇష్టపడతారు. అయితే మీరు ఆకులు తిన్నారా..? అవును. మామిడి ఆకులలో ఫైబర్, విటమిన్ సీ,పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని కాస్త చల్లార్చి తర్వాత వడగట్టి తాగవచ్చు.
వేప ఆకులు: వేప ఆకులు రుచి చాలా చేదుగానే ఉండవచ్చు కానీ ఇది ఆయుర్వేదంలో గొప్ప ఔషధం. దాని ఔషధ గుణాలు మధుమేహ రోగులకు చక్కెరను నియంత్రించడంలో సహకరిస్తాయి. ఈ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్‌తో పాటు యాంటీవైరల్ గుణాలు ఉండటం వల్ల మధుమేహం ప్రభావం తగ్గుతుంది. కొందరు దీనిని నమిలి లేదా ఆకులను పొడిగా చేసి నీటిలో కలిపి తాగుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..