కాలేయం అనేది ప్రతి వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే పనిని చేస్తుంది. అలాగే అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, కాలేయాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. మీరు కాలేయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే.. మీ డైట్‌లో కొన్ని పదార్థాలను జోడించుకోవాలి. ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా లివర్ డిటాక్సిఫై అవుతుంది. కాలేయం శుభ్రంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు, తాజా పండ్లను డైట్ లో చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేసుకోవచ్చు. రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా నమలడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మలినాలను శుభ్రం చేయవచ్చు. అలాగే ఇది అనేక ఇతర సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా లివర్ డిటాక్సిఫై అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది వాపు నుంచి ఉపశమనం పొందడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది. అలాగే, కాలేయంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాలేయంలోని మలినాలను శుభ్రం చేయడానికి పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగండి. ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను అధిగమించవచ్చు. అలాగే, కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం చూడండి..