Health Tips: టీవీలకు ఎక్కువ సమయం అతుక్కుపోతున్నారా.. ఈ సమస్యల బారిన పడే ప్రమాదం..

ప్రతి వ్యక్తి తన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికో, ఖాళీ సమయాన్ని గడపడం కోసం టీవీలను చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే టీవీలకు అతుక్కుపోతుంటారు. అవతల ప్రపంచం ఎటూ పోయినా నాకేంటిలే అనుకుంటూ..

Health Tips: టీవీలకు ఎక్కువ సమయం అతుక్కుపోతున్నారా.. ఈ సమస్యల బారిన పడే ప్రమాదం..
Watching Tv
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 30, 2022 | 8:00 AM

ప్రతి వ్యక్తి తన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికో, ఖాళీ సమయాన్ని గడపడం కోసం టీవీలను చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే టీవీలకు అతుక్కుపోతుంటారు. అవతల ప్రపంచం ఎటూ పోయినా నాకేంటిలే అనుకుంటూ ఎక్కువ సేపు టీవీ స్క్రీన్ లకే అతుక్కుపోతుంటారు. ప్రతి రోజు రోజు గంటల తరబడి టీవి చూస్తుంటారు. అయితే  టీవీ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.   ప్రతిరోజూ ఒక గంట కంటే తక్కువ సమయం టీవీ చూడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 11 శాతం వరకు తగ్గించవచ్చని తేల్చింది. మఖ్యంగా చిన్న పిల్లలు సైతం ఇటీవల కాలంలో మొబైల్, టీవీ స్క్రీన్లకు ఎక్కువ సేపు పరిమితిమవుతున్నారు. దీంతో తక్కువ వయసులోనే కళ్ల జోళ్లు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కవు సేపు టీవీ లేదా మరే ఇతర స్క్రీన్లకు అతుక్కుపోయినా ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

రోజుకు 4 గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వారు వెల్లడించారు. రోజుకు 2-3 గంటలు టీవీ చూసే వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 6 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం నిర్వాహకులు 5లక్షల కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుంచి పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌లను సేకరించారు. శారీరకంగా చురుకుగా ఉండటానికి బదులుగా ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వారు చెబుతున్నారు.

టీవీ చూడటం లేదా కంప్యూటర్‌ను ఉపయోగించడం వల్ల చాలామంది ఒక దగ్గర గంటల తరబడి కూర్చుంటారు. దీనివల్ల గుండె పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వాస్తవానికి కదలకుండా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం శరీరానికి అంత మంచిది కాదు. కనీసం అర్దగంటకి ఒకసారైనా శరీరంలో కదలికలు ఉండాలి. లేదంటే ధీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..