Hair fall and Sleeping: మీ జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? దానికి కారణమేమిటో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఒకప్పటి రోజుల్లో ప్రజలు కంటి నిండా నిద్ర పోయేవారు. ఆరోగ్యం, ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించేవారు. అందువల్లనే వారు చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ ప్రస్తుత కాలంలో.. దానికి ఫలితంగా..

Hair fall and Sleeping: మీ జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? దానికి కారణమేమిటో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Hairfall And Sleeping
Follow us

|

Updated on: Dec 08, 2022 | 9:39 PM

ఒకప్పటి రోజుల్లో ప్రజలు కంటి నిండా నిద్ర పోయేవారు. ఆరోగ్యం, ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించేవారు. అందువల్లనే వారు చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనిషికి తగినంత నిద్ర ఉండడంలేదు. కనీసం విశ్రాంతి తీసుకునే తీరిక కూడా ఉండనంత బిజీ అయిపోతున్నాడు. ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే అది అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికైనా సరిగ్గా నిద్రపోకపోతే వారికి కళ్ళు మూసుకుపోయి, తలనొప్పి వస్తుంది . అందుకే విశ్రాంతి , తగినంత నిద్ర మానవ ఆరోగ్యానికి అవసరమని చెబుతారు వైద్య నిపుణులు, మన పూర్వీకులు.

నిద్ర లేకపోవడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని మీరు వినే ఉంటారు. అయితే తక్కువ నిద్రపోయే వారి జుట్టు నాణ్యత కూడా తక్కువగా ఉంటుందని.. ఫలితంగానూ జుట్టు రాలడం ప్రారంభమవుతుందని మీకు తెలుసా..? నిద్రకు, జుట్టు రాలడానికి గల సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్ర శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

ఆరోగ్య నిపుణుల ప్రకారం నిద్ర పోయే సమయం కంటే తక్కువగా నిద్ర పోవడం వల్ల మనపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తలలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు జుట్టు మూలాలకు రక్తం, పోషకాలు, ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడం మొదలవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తగినంత సమయం, ప్రశాంతంగా నిద్ర పొవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఎన్ని గంటల నిద్ర అవసరం..?

ఒక మనిషికి తన రోజువారీ పనులను సక్రమంగా, సాఫీగా నిర్వహించడానికి కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం. ఎవరైనా ఇంతకంటే తక్కువ గంటలు నిద్రపోతే ఆ వ్యక్తి శరీరంలో టెన్షన్ అలాగే ఉంటుంది. ఇంకా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాక జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది.

మీరు సరిగ్గా నిద్రపోలేకపోతే, దీన్ని ప్రయత్నించండి .

  • సరిపడా నిద్రపోవడానికి ప్రయత్నించండి.
  •  పడుకునేటప్పుడు మీ గదిలో కొద్దిగా తక్కువ కాంతిని ఉంచడం కూడా మీ నిద్రకు చాలా ముఖ్యం.
  • చుట్టుపక్కల శబ్దం కూడా సరిగ్గా నిద్రపోవడానికి ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి మీ నిద్రకు భంగం కలగకుండా ప్రశాంతమైన ప్రదేశంలో పడుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..