- Telugu News Health Benefits of pumpkin seeds can fight with deadly dieseses like cancer and heart stroke Telugu Health News
Pumpkin Seeds: గుమ్మడి కాయ గింజల్లో ఇంత శక్తి ఉందా..? రోజూ తింటే ఏమవుద్దో తెలుసుకోండి.!
గుమ్మడి కాయ.. సాధారణంగా దీనిని మనం ఎందుకూ పనికి రానిదిగా భావిస్తాం.. కేవలం దిష్టి తీయడానికి మాత్రం ఉపయోగిస్తాం. తర్వాత పక్కకు తీసుకెళ్లి పడేస్తాం. అయితే..
Updated on: Dec 11, 2022 | 3:27 PM

గుమ్మడి కాయ.. సాధారణంగా దీనిని మనం ఎందుకూ పనికి రానిదిగా భావిస్తాం.. కేవలం దిష్టి తీయడానికి మాత్రం ఉపయోగిస్తాం. తర్వాత పక్కకు తీసుకెళ్లి పడేస్తాం. అయితే గుమ్మడి.. ఔషధాల నిధి అని ఎంతమందికి తెలుసు. మన ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం.. ఎన్నో రకాల ఆహార పదార్థాలు ట్రై చేస్తుంటాం. జిమ్ చేస్తాం.. రన్నింగ్ వాకింగ్ అంటూ చవటలు పట్టిస్తాం.. అయితే అన్నిటికంటే తేలికగా దొరికి.. ఆరోగ్యాన్నిచ్చే గుమ్మడి కాయలను మాత్రం తేలికగా తీసిపారేస్తాం. ముఖ్యంగా గుమ్మడి గింజల్లో కేన్సర్ కణాలను నిరోధించే శక్తి ఉందంటే నమ్మగలరా? నిజమండీ.. దీనిని రోజూ తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక క్వార్టర్ కప్ తీసుకున్నా అవి శరీరానికి చేసే మంచి అంతా ఇంతా కాదని వివరిస్తున్నారు.

ఆరోగ్యానికి మేలు.. గుమ్మడి గింజల్లో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, మేగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాపడుతోంది. గుండె పోటు రాకుండా రక్షిస్తుంది. అలాగే ట్రైప్టోఫాన్ నిద్ర సక్రమంగా పట్టేందుకు ఉపకరిస్తుంది. అదే విధంగా గుమ్మడి గింజలో ఔషధాలు బ్రెస్ట్, ప్రోస్టేట్ కేన్సర్లను నిరోధిస్తుందని అనేక అధ్యయనాల్లో నిరూపణ అయ్యిందని నిపుణలు చెబుతున్నారు.

ఎలా తినాలి.. ఇదంతా బాగుందండీ.. మరీ గింజలను ఎలా తింటాం అని ఆలోచిస్తున్నారా? ఇక ఆలోచించకండీ.. వెంటనే దీనిని చదవండి..

కాయను కాయలాగే తినేయవచ్చు.. గుమ్మడి గింజలను కాయతో కలిపి తినడం అన్నిటి కన్నా ఉత్తమం.. ఒక చిన్న జార్లో చిన్న చిన్న ముక్కుగా కాయను కోసుకుని కొంచెం సాల్ట్ జల్లుకుని జుర్రుకుని తీనేయొచ్చు.

వండుకొని తినొచ్చు.. గుమ్మడి గింజలను వండుకుని సలార్డ్స్, డిస్సెర్ట్స్ వంటివి చేసుకుని తినొచ్చు. అలాగే వంట గదిలోని వెళ్లి ఆలివ్ ఆయిల్ లేదా బటర్ తీసుకుని టేస్ట్ కోసం సాల్ట్ వంటి కొన్ని ఇన్ గ్రేడియంట్స్ కలుపుకుని గ్రేవీ కూరలాగ చేసికుని కూడా దీనిని ఆరగించవచ్చు.


బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా.. ఉడికించిన గుమ్మడి గింజలతో మంచి బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకోవచ్చు. కొన్ని అరటిపండ్లు, బ్లూ బెర్రీ, లేదా మామిడికాయలను వేసి ఉడికిన గుమ్మడి గింజలనకు బాగా మిక్స్ చేస్తే మంచి టేస్టీ సూథీ అవుతుంది.




