heavy bleeding in periods: 20 రోజులైనా రక్తస్రావం ఆగలేదా?.. కారణం కేన్సర్ కావచ్చు! అశ్రద్ధ చేయొద్దు..
అధిక రక్తస్రావానికి కారణాలు.. రుతుచక్రం క్రమం తప్పడానికి చాలా కారణాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. అది వయసులబట్టి మారుతుంటుందని చెబుతున్నారు.
పీరియడ్స్.. మహిళల్లో సర్వ సాధారణంగా ప్రతి నెలలో జరిగేవే అయినా.. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు ఆ సమయం దగ్గరపడుతుందంటేనే భయపడతారు. ఆ నొప్పిని తట్టుకోలేక, అధిక స్రావమైతే ప్యాడ్లను మార్చుకోలేక ఇబ్బందులు పడతారు. అంతేకాక అధిక రక్తస్రావమైతే వారు నీరసించిపోవడం.. త్వరగా అనారోగ్యం గురవడం జరుగుతుంటుంది. సాధారణంగా రుతుక్రమం ప్రతి నెల 28 రోజుల తర్వాత వస్తుంది. 3 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. కొందరిలో 7 రోజులపాటు కొనసాగవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి అధిక రక్తస్రావమయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొందరు స్త్రీలలో ఈ పీరియడ్స్ ఏకంగా 15 రోజులు, 20 రోజులపాటు కొనసాగుతుంది. ఇది ప్రమాదకరమని గైనకాలజీ నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తస్రావానికి కారణాలు.. రుతుచక్రం క్రమం తప్పడానికి చాలా కారణాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. అది వయసులబట్టి మారుతుంటుందని చెబుతున్నారు. ప్రధానంగా పీరియడ్స్ సైకిల్ తప్పడానికి కారణం హార్మోన్మ సమతుల్యత దెబ్బతినడం . అలాగే ఫైబ్రాయిడ్స్, ఎడెనోమోసిస్, గర్భ ధారణ సంబంధిత అంశాలు, కొన్ని రకాల ఇన్ఫక్షన్లు కారణం కావచ్చు. అయితే ఏడు రోజులకు మించి రక్తస్రావం అవుతూ ఉంటే మహిళలు వెంటనే అప్రమత్తం అవ్వాలని హెచ్చరిస్తున్నారు. రక్తంలో ఏమైనా గడ్డలు వస్తున్నాయా అనేది పరిశీలించాలని, అలాగే రక్తం రంగు పింక్, బ్రోన్, తుప్పు వంటి రంగుల్లోకి ఏమైనా మారిందా అన్న విషయాలను గమనించాలని చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత.. 20 రోజుల వరకూ రక్త స్రావం కొనసాగితే దానికి హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణం. ప్రత్యుత్పత్తికి కారణమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో లోపాలను గుర్తించి తగిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైబ్రాయిడ్స్.. గర్భాశయం( యుటెరస్) సైజ్ పెరిగే ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల అధిక పీరియడ్స్, రుతుక్రమం దెబ్బతినడం, శృంగారం చేస్తున్నప్పుడు నొప్పి రావడం , అధికంగా వెన్ను నొప్పి దీని లక్షణాలు.
పొలిప్స్.. గర్భాశయం(యుటెరస్) లోపలి లేయర్లో కణాలు అధికంగా వృద్ధి చెందడం ద్వారా యుటరిన్ కావిటీ దెబ్బ తింటుంది. ఇదికూడా రుతుక్రమం తప్పడానికి కారణం కావచ్చు.
కేన్సర్.. పీరియడ్స్లో అధిక రక్తస్రావం కు కేన్సర్ కణాలు కూడా అయ్యే అవకాశం ఉంది. గర్భాశయం లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద కేన్సర్ కణాలు వృద్ధి చెందడంతో రక్త స్రావం అవుతుంది. వీటితో పాటు హెచ్ఐవీ వంటి వ్యాధులకు మందులు వాడుతున్న వారిలో కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇవి కూడా కారణం కావచ్చు.. రక్తాన్ని చిక్కపరిచే మందులు ఆస్పరిన్ వంటి ట్యాబ్లెట్స్ వంటివి.. గర్భనిరోధక మాత్రలు కూడా పీరియడ్స్ తప్పడానికి కారణం కావచ్చు.
చికిత్స ఇదీ.. భారీ రుతుక్రమానికి చేసే చికిత్స వ్యక్తిని బట్టి మారుతుంటుంది. వారి పరిస్థితులు, ఒంటితత్వం, వయసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వైద్యులు చికిత్స చేస్తారు.