AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Positions: మీరు పడుకునే స్లీపింగ్ పోజిషన్ కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.. అది ఎలాగో తెలుసుకుందాం రండి..

మానవుని శారీరక, మానసిక ఆరోగ్యాలకు నిద్ర చాలా ముఖ్యం. అందుకే నిద్రలేమి వంటి సమస్యలు మన ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి . సరిగా నిద్రపోకపోతే మన ఆలోచనా శక్తి.. ఇంకా..

Sleeping Positions: మీరు పడుకునే స్లీపింగ్ పోజిషన్ కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.. అది ఎలాగో తెలుసుకుందాం రండి..
Sleeping Position
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 4:16 PM

Share

మానవుడు నిత్యం బిజీ బిజీ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోవడం వల్ల అతనికి విశ్రాంతి తీసుకునే సమయం కూడా లభించడంలేదు. కానీ మానవుని శారీరక, మానసిక ఆరోగ్యాలకు నిద్ర చాలా ముఖ్యం. అందుకే నిద్రలేమి వంటి సమస్యలు మన ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. సరిగా నిద్రపోకపోతే మన ఆలోచనా శక్తి, ఏకాగ్రత, భావోద్వేగాలు, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. కాబట్టి సరిపడినంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం. అయితే మనం సరిపడినంత సమయం నిద్రపోయినా.. సరిగా నిద్రపోయిన భావన మనకు చాలా సందర్భాలలో కలగదు. అందుకు కూడా కారణాలు ఉన్నాయి. మనం పడుకున్న నిద్రాభంగిమలు కూడా మన నిద్రపై ప్రభావం చూపుతాయి. అసలు స్లీపింగ్ పోజిషన్ లేదా నిద్రాభంగిమ అంటే ఏమిటంటే..

స్లీపింగ్ పొజిషన్: సాధారణ స్లీపింగ్ పొజిషన్‌లను మూడు రకాలుగా విభజించవచ్చు. పొట్ట మీద పడుకోవడం, ఒకవైపుకు తిరిగి పడుకోవడం, వీపు మీద పడుకోవడం.  మీరు పడుకునే నిద్రాభంగిమ మీకు సౌకర్యంగా అనిపించినా, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

1. వీపు కిందకు పెట్టి పడుకోవడం:

వీపు కిందకు పెట్టి  నిద్రపోవడం మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ వెన్నెముకకు చాలా మంచిది. ఇంకా  మీ వెనుక, మెడ కండరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ భంగిమ మీ చర్మంలో, ముఖ్యంగా మహిళల వృక్షోజాల ముడతలను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

2. కుడి లేదా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం:

మీ శరీరానికి ఎడమ లేదా కుడి వైపున పడుకోవడం అలవాటు చేసుకున్నారా..? ఇలా పడుకోవడం మీకు సౌకర్యంగా అనిపించినప్పటికీ, అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు నిరంతరం ఒక వైపు నిద్రిస్తున్నప్పుడు మీ చేతులు, కాళ్ళలో నొప్పిని అనుభవించవచ్చు. మీ శరీరం కుడి వైపున నిద్రించడం వలన మీ జీర్ణక్రియ, ఛాతీ ప్రాంతంపై దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే గురక సమస్య తగ్గడానికి మీరు ఈ భంగిమలో పడుకోవడం చాలా మంచిది.

3కడుపును కిందకు పెట్టి ​​పడుకోవడం:

మీకు కడుపు కిందకు పెట్టి నిద్రపోయే అలవాటు ఉంటే ఈ రోజే అలా పడుకోవడాన్ని మానేయండి. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతగానో హాని చేస్తుంది. ఈ విధమైన నిద్రాభంగిమ మీ వెన్ను, మెడ నొప్పికి కారణమవుతుంది.  మీ వెన్నెముక వంగిన ఆకారాన్ని తీసుకోవడానికి కూడా ఇది కారణం కావచ్చు. కాబట్టి ఈరోజు నుంచే ఈ స్లీపింగ్ పోజిషన్‌కు దూరంగా ఉండండి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..