AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nails Health: గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..

మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే.. గోళ్లపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన గోళ్ల పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా....

Nails Health: గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..
Nails Health
Ganesh Mudavath
|

Updated on: Dec 11, 2022 | 4:43 PM

Share

మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే.. గోళ్లపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన గోళ్ల పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దృఢమైన, మెరిసే గోళ్లను సొంతం చేసుకోవచ్చు. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల గోర్లు బలహీనంగా మారతాయి. గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు, డిటర్జెంట్లు గోళ్లను పెళుసుగా మార్చి, విరిగిపోయేలా చేస్తాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం కూడా గోళ్ల ఆరోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి బలమైన, ఆరోగ్యకరమైన గోర్లను సొంతం చేసుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అధిక నీరు, సబ్బులు, స్ప్రేలను ఉపయోగించాల్సిన సందర్భాల్లో చేతులకు గ్లౌజులు వేసుకోవడం ఉత్తమం. ఇది గోళ్లకు హాని కలిగించే రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. చేతులను ఎక్కువసేపు నీటిలో తడవకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.

పొడవాటి గోళ్ల కంటే పొట్టి గోర్లు ఉత్తమం. చిన్న గోర్లను శుభ్రంగా ఉంచడం చాలా సులభం. వాటిలో మురికి పేరుకుపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. కృత్రిమ గోర్లు పొందడం అనేది ఆకర్షణీయంగా కనిపించడానికి సరికొత్త మార్గం. గోళ్లను అటాచ్ చేయడం కోసం జిగురును ఉపయోగించడం వల్ల వాటిని బలహీనపరచడమే కాకుండా, అవి చాలా మురికిని కూడా తీసుకుంటాయి. గోళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉండే సమతుల్య భోజనం ప్రతిరోజూ తీసుకోవాలి. మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే, మన గోళ్ళకు శ్రద్ధ అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత ప్రతిబింబం మన ఆరోగ్యకరమైన గోళ్ల ద్వారా కనిపిస్తుంది.

బలమైన గోర్లు అభివృద్ధికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లను చేర్చాలి. ఏవైనా కారణాల వల్ల గోర్లు బలహీనంగా ఉంటే బయోటిన్ వంటి సప్లిమెంట్లను వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. తగినంత నీరు తాగినప్పుడు గోర్లు తేమను నిలుపుకుంటాయి. హ్యాండ్ శానిటైజర్లను తగ్గించాలి. వ్యాధుల బారి నుంచి శానిటైజర్ కాపాడుతున్నప్పటికీ.. అది గోర్లకు నష్టం కలిగిస్తోందనే విషయాన్ని విస్మరించకూడదు. ఈ సింపుల్ టిప్స్ ను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన గోళ్లను సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ