AP Weather: తుఫాన్ ఎఫెక్ట్.. మరో ఆవర్తనం కూడా.. ఏపీకి 3 రోజులపాటు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. తిరుమలలో కుండపోత నమోదయింది. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అల్పపీడన ప్రాంతం ( తుఫాను మాండౌస్ అవశేషం) ఉత్తర అంతర్గత తమిళనాడు, ఆనుకుని ఉన్న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక & ఉత్తర కేరళపై బలహీన పడినది. అయినప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది ఉత్తర కేరళ -కర్ణాటక తీరంలో ఆగ్నేయ & ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉద్భవించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబరు 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదలి ఆ తర్వాత భారత తీరము నాకు దూరంగా వెళ్తుంది. డిసెంబర్ 13, 2022 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈరోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :–
ఈరోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
………………………
మాండూస్ తుఫాన్ ప్రభావంలో శ్రీశైలంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు..వర్షంలోనూ శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు భక్తులు..ఆదివారం కావడంతో క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. దీంతో దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం