AP 10th Exam Fee: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి 2022-23 పరీక్షల ఫీజు గడువును పెంపొందిస్తూ ప్రకటన విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుముసులేకుండా పరీక్ష ఫీజు చెల్లింపులు డిసెంబర్ 10వ తేదీతో ముగియగా..తాజా..
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి 2022-23 పరీక్షల ఫీజు గడువును పెంపొందిస్తూ ప్రకటన విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుముసులేకుండా పరీక్ష ఫీజు చెల్లింపులు డిసెంబర్ 10వ తేదీతో ముగియగా..తాజా ప్రకటనతో డిసెంబర్ 20వ తేదీ వరకు గడువు పెంపొందించింది. దీంతో అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125లు గడువు తేదీలోపు విద్యార్ధులు ఫీజుల చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. రూ.50ల ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 వరకు, రూ.200ల ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు, రూ.500ల ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.
కాగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచకపోవడం గమనార్హం. అన్ని పరీక్షలకు కేవలం రూ.125లు వసూలు చేస్తున్నారు. వృత్తి విద్యా కోర్సులకు చెందిన విద్యార్ధులు రూ.125ల ఫీజుతో పాటు, ప్రాక్టికల్స్‌కు అదనంగా రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్ధులు ఈ సారి జరగబోయే పరీక్షలకు హాజరయ్యేందుకు మూడు అంత కంటే తక్కువ సబ్జెక్టులుంటే రూ.110లు ఫీజుగా చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్ విద్యార్ధులతో సమానంగా రూ.125 చెల్లించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.