Beauty Tips: కలువ కళ్ళకు నల్లని కాటుక పెడుతున్నారా..? ఎన్ని లాభాలో..
Srilakshmi C |
Updated on: Dec 11, 2022 | 2:00 PM
కాటుక కళ్ళు ఆకర్షిస్తాయి, కాటుక కళ్ళు మాట్లాడతాయి అంటూ కవితలు ఒలకబోస్తారు కవిహృదయులు. కాటుక వల్ల మగువల కళ్లకు అందం రావడమే కాదు.. ముఖం కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిజానికి.. కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళే! కాటుక కళ్లకు మంచి ఆకృతిని ఇచ్చి అందం రెట్టింపు చేయడంతోపాటు..
Dec 11, 2022 | 2:00 PM
కాటుక కళ్ళు ఆకర్షిస్తాయి, కాటుక కళ్ళు మాట్లాడతాయి అంటూ కవితలు ఒలకబోస్తారు కవిహృదయులు. కాటుక వల్ల మగువల కళ్లకు అందం రావడమే కాదు.. ముఖం కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
1 / 5
నిజానికి.. కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళే! కాటుక కళ్లకు మంచి ఆకృతిని ఇచ్చి అందం రెట్టింపు చేయడంతోపాటు కంటికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అందుకే మన పూర్వికుల కాలం నుంచి కళ్లకు కాటుక పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
2 / 5
కాటుకను ఎల్లప్పుడు చల్లటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఇలా ఉంచిన కాటుకను కంటికి పెట్టుకుంటే కల్లు ఆరోగ్యంగా ఉండటమేకాకుండా, లుక్ బాగుంటుంది.
3 / 5
చాలా మందికి కాటుక చేత్తో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాటుక పెట్టుకునే ముందు కళ్లకు ఫేస్‌పౌడర్ రాసుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాటుక చేత్తో పెట్టుకునేటప్పుడు ముఖంపై మరెక్కడా అంటుకోకుండా చేస్తుంది.
4 / 5
కాటుక పెట్టుకున్న తర్వాత కళ్లను నలపకూడదు. ఒకవేళ నలిపితే కళ్ల చుట్టూ కాటుక చెదరిపోయి అందవిహీనంగా కనిపిస్తుంది.