PGCIL: డిప్లొమా ఉంటే చాలు.. లక్ష జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు పొందవచ్చు..పూర్తి వివరాలివే..

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశంలోని వివిధ రీజియన్లు, కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న.. 211 డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే..

PGCIL: డిప్లొమా ఉంటే చాలు.. లక్ష జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు పొందవచ్చు..పూర్తి వివరాలివే..
Power Grid Corporation Of India
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2022 | 6:01 PM

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశంలోని వివిధ రీజియన్లు, కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న.. 211 డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్/సివిల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమా కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బీటెక్‌/బీఈ/ఎంఈ/ఎంటెక్‌లో కనీస మార్కులతో పాసై ఉండాలి. అలాగే వయసు డిసెంబర్‌ 31, 2022 నాటికి 27 ఏళ్లకు మించకూడదు.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 31, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ రూ.300లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి-2023లో ఉంటుంది. మెరిట్ సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.1,17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.