SSC SPE 2020 Results: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఫేజ్-IX ఎగ్జామినేషన్-2021 ఫలితాలు విడుదల
ఎస్సెస్సీ ఫేజ్-IX ఎగ్జామినేషన్-2021 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) డిసెంబర్ 8న విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని మొత్తం 1,311 పోస్టులకు ఏడాది మార్చిలో..
ఎస్సెస్సీ ఫేజ్-IX ఎగ్జామినేషన్-2021 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) డిసెంబర్ 8న విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని మొత్తం 1,311 పోస్టులకు ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది వరకే విడుదల చేసిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలకు అదనంగా (Additional Result) వీటిని వెల్లడించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల వారీగా ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన వారు తదుపరి దశకు.. ఆన్‌లైన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన ఇతర డాక్యుమెంట్లను డిసెంబర్ 30వ తేదీలోపు స్పీడ్ పోస్టు ద్వారా సంబంధిత రీజనల్ ఆఫీస్‌లకు పంపించవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.