వాహన ప్రియులకు షాక్! వచ్చే నెల నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయ్..
Srilakshmi C |
Updated on: Dec 08, 2022 | 7:31 PM
వచ్చే ఏడాది (2023) జనవరి నుంచి పలు బ్రాండెడ్ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలో ఏయే కంపెనీ కార్ల ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం. టాటా మోటార్స్‌కు చెందిన వివిధ మోడళ్లను బట్టి పెరిగిన ధరలు మారుతూ ఉంటాయి..
Dec 08, 2022 | 7:31 PM
2023, జనవరి నుంచి పలు బ్రాండెడ్ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలో ఏయే కంపెనీ కార్ల ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం. టాటా మోటార్స్‌కు చెందిన వివిధ మోడళ్లను బట్టి పెరిగిన ధరలు మారుతూ ఉంటాయి.
1 / 6
మారుతీ సుజుకీ ఇండియా కూడా జనవరి నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత మేర పెంపుదల ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వివిధ మోడళ్లను బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుంది.
2 / 6
రెనాల్ట్ కూడా వచ్చే జనవరి నుంచి కార్ల రేట్లను కూడా పాక్షింగా పెంచనున్నట్లు తెల్పింది. వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ మారకపు ధరలలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, ఇతర కారణాల వల్ల కార్ల రేట్లలో మార్పులు సంభవిస్తుంటాయి.
3 / 6
జనవరి నుంచి కార్ల ధరలను 1.7 శాతం పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.
4 / 6
కియా ఇండియా కూడా వచ్చే నెల నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఎంత మేర పెంచనున్నారనేది మాత్రం వెల్లడించలేదు. వివిధ మోడళ్ల కార్లపై 50,000ల వరకు పెరిగే అవకాశం ఉంది.
5 / 6
జనవరి నుంచి కార్ల ధరలను 5 శాతం పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది.