7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023లో డీఏ ఎంత పెరుగుతుందంటే..? కొత్త ఏడాదిలో ప్రతిరోజూ పండగే..
కొత్త ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభప్రదంకానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా మూడు ప్రధాన సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రివిజన్, 18 నెలల డీఏ బకాయిలను క్లియర్ చేసేందుకు..
కొత్త ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభప్రదంకానుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా మూడు ప్రధాన సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రివిజన్, 18 నెలల డీఏ బకాయిలను క్లియర్ చేసేందుకు సమాయాత్తం అవుతోంది. ఈ మూడు నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. సాధారణంగా డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)లను ప్రభుత్వం ప్రతీ ఏట రెండు సార్లు సవరిస్తుంది. జనవరి 1న ఒకసారి, జూలై 1న మరోసారి కేంద్రం డీఏ పెంపు చేపడుతుంది. ఈ ఏడాది (2022)కిగానూ చివరి సారిగా డీఏ 4 శాతం పెంచడంతో అది 38 శాతానికి పెరిగింది. అంతకంటే ముందు మార్చిలో 3 శాతం పెంచడంతో 34 శాతానికి పెరిగింది.
2023లో డీఏ ఎంత పెరుగుతుంది..?
కొత్త ఏడాది (2023) మార్చి నెలలో డీఏ పెంపొందించే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సులు, ద్రవ్యోల్బణం రేటు.. ఈ రెండింటి దృష్ట్యా ఆసారి 3 నుంచి 5 శాతం వరకు డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ బకాయి చెల్లింపుల విషయం కూడా ఓ కొలిక్కి రానుంది. ఆ అంశంపై క్యాబినెట్‌లో చర్చ జరిగేందుకు నిర్ణయం జరిగింది. ఒకవేళ క్యాబినెట్ ఆమోదం తెల్పితే పెండింగ్‌లోనున్న 18 నెలల డీఏ బకాయిల ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమవుతాయి.
కనీస వేతనాన్ని రూ.18,000ల నుంచి రూ.26,000లకు పెంచాలని, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లు పెంచాలని ఎంతో కాలంగా కేంద్ర ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా 3.68కి పెంచితే ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26,000లకు పెరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.