Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా.. డిసెంబర్ 9వ తేదీన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీ గురువారం నాటి ధరలే శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల..

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 09, 2022 | 5:55 AM

కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా.. డిసెంబర్ 9వ తేదీన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీ గురువారం నాటి ధరలే శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కన్పించింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై సుమారు రూ. 300 వరకు తగ్గగా.. గురువారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 200 వరకు పెరిగింది. శుక్రవారం మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 49,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,150 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 49,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 54,000 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,160 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 54,720 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 49,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 49,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 49,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 54,000 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 54,000 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఓవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధరలో పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,200 , ముంబైలో రూ. 66,200 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,300 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..