Year In Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలేమిటో మీకు తెలుసా..? మీరు వెతికిన వర్డ్స్ కూడా ఉన్నాయేమో ఓ సారి చూడండి..

ఇంటర్‌నెట్‌లోని దిగ్గజ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ మన అవసరాలను ఇట్టే తీర్చి, మనకు కావలసిన సమచారాన్ని క్షణాల్లో మన ముందు కనపించేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది నిత్యం అనేక పదాలను..

Year In Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలేమిటో మీకు తెలుసా..? మీరు వెతికిన వర్డ్స్ కూడా ఉన్నాయేమో ఓ సారి చూడండి..
Most Seached Words 2022
Follow us

|

Updated on: Dec 11, 2022 | 5:05 PM

మనకు ఏదైనా సమాచారం కావాలంటే ఓకప్పుడు లైబ్రరీకి వెళ్లడమో లేదా మన పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవడమో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండానే ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌లోని దిగ్గజ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ మన అవసరాలను ఇట్టే తీర్చి, మనకు కావలసిన సమచారాన్ని క్షణాల్లో మన ముందు కనపించేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది నిత్యం అనేక పదాలను సెర్చ్ చేస్తుంటారు. అలాగే మన దేశంలో కూడా అనేక కోట్ల మంది ప్రతిరోజూ అనేక పదాల గురించి వెతుకుతుంటారు.

అయితే తాజాగా గూగుల్‌లో 2022 సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పదాల జాబితాను ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ అనే పేరుతో విడుదల చేసింది. మరి అలా 2022 సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన ‘టాప్ 10 పదాలు’ ఏమిటో తెలుసా..? ఈ పదాలలో కనీసంలో కనీసంగా 5 పదాలను అయినా మీరు తప్పక సెర్చ్ చేసే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించిన గేమ్ Wordle. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం బ్రూక్లిన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జోష్ వార్డెల్ తన భారతీయ భాగస్వామి పాలక్ షాతో కలిసి ఆడేందుకు ఈ గేమ్‌ను రూపొందించాడు. 

ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఉక్రెయిన్, క్వీన్ ఎలిజబెత్ వంటివి Wordle తర్వాత భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలు. క్రికెట్, ఫుట్‌బాల్, బాలీవుడ్ కూడా ఈ టాప్ 10లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టాప్ 10 పదాలు..

1. ఇండియన్ ప్రీమియర్ లీగ్

2. కోవిడ్

3. ఫిఫా ప్రపంచ కప్

4. ఆసియా కప్

5. ఐసీసీ టీ20 ప్రపంచ కప్

6. బ్రహ్మాస్త్రం: మొదటి భాగం – శివ

7. ఈ-శ్రామ్ కార్డ్

8. కామన్వెల్త్ గేమ్స్

9. కేజీఎఫ్: పార్ట్ 2

10. ఇండియన్ సూపర్ లీగ్

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..