Watch Video: వామ్మో.. ఈ రాక్షస జీవులు ఇంకా జీవించే ఉన్నాయా? నెట్టింట చక్కర్లు కొడుతోన్న బుల్లి డైనోసార్ల వీడియో

ఈ  రాక్షస జీవులు భూమిపై కనిపించనప్పటికీ అప్పుడప్పుడు మనం సిల్వర్‌ స్ర్కీన్‌పై చూస్తూనే ఉన్నాం. జురాసిక్‌ పార్క్‌ సిరీస్‌కు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన ఆనవాళ్లు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి.

Watch Video: వామ్మో.. ఈ రాక్షస జీవులు ఇంకా జీవించే ఉన్నాయా? నెట్టింట చక్కర్లు కొడుతోన్న బుల్లి డైనోసార్ల వీడియో
Animals
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2022 | 4:54 PM

కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భారీ జంతువులు భూమిపై నివసించేవి. అవి నేడు కనిపించే ఏనుగుల కంటే ఎన్నో రెట్లు పెద్దవి. అలాంటి భారీ జంతువుల్లో డైనోసార్‌లు ఒకటి. చూడడానికి ఎంతో భయంకరంగా, భారీగా ఉండే ఈ జీవులు ఇప్పుడు అంతరించిపోయాయి. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక పెద్ద ఉల్క పడిపోవడం వల్ల ఈ రాక్షస జీవులు శాశ్వతంగా అంతరించిపోయాయని ప్రచారంలో ఉంది. అయితే ఈ  రాక్షస జీవులు భూమిపై కనిపించనప్పటికీ అప్పుడప్పుడు మనం సిల్వర్‌ స్ర్కీన్‌పై చూస్తూనే ఉన్నాం. జురాసిక్‌ పార్క్‌ సిరీస్‌కు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన ఆనవాళ్లు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి. వాటిని బట్టే ఈ జీవులకు సంబంధించిన ఎన్నో విశేషాలను శాస్త్రవేత్తలు బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పుడప్పుడు డైనోసార్లు కనిపించాయంటూ కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ  వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు డైనోసార్లు ఇంకా జీవించే ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ వీడియోలో డైనోసార్‌ల మాదిరిగా ఉండే కొన్ని వింత జీవులు అడవిలో పరిగెడుతూ కనిపిస్తున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన వీడియో. అడవిలో డైనోసార్‌ల మాదిరిగా ఉండే చిన్న చిన్న జీవులు బుల్లి బుల్లి అడుగులు వేస్తుండడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. నిజమైన డైనోసార్‌లతో పోలిస్తే ఎత్తులో ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ, మెడ మాత్రం అచ్చు డైనోసార్లలాగే ఉంటోంది. శాకాహార డైనోసార్లకు ఇంత సన్నగా పొడుగ్గా ఉండే మెడలు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, అవి నిజంగా డైనోసార్‌లా లేదా మరే ఇతర జీవులా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన వీడియో @Gulzar_sahab అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘ఈ డైనోసార్‌లు ఎక్కడ నుండి వచ్చాయి?’ అనే క్యాప్షన్‌ను జోడించారు. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్‌, వేలాది లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..