Love Story: కోచింగ్ సెంటర్‌లో చిగురించిన ప్రేమ.. 24 ఏళ్ల స్టూడెంట్‌ను పెళ్లాడిన 42 ఏళ్ల టీచర్‌

ప్రేమలో పడ్డాక ప్రపంచాన్నే మర్చిపోతారంటారు. ఈ ప్రేమకథలో కూడా అంతే. బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే.

Love Story: కోచింగ్ సెంటర్‌లో చిగురించిన ప్రేమ.. 24 ఏళ్ల స్టూడెంట్‌ను పెళ్లాడిన 42 ఏళ్ల టీచర్‌
Teacher, Student marriage
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2022 | 9:37 PM

ప్రేమ గుడ్డిది అనే సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం. దీనికి తగ్గట్లే ప్రేమకు వయసు, ప్రాంతం, కులం, మతం.. ఇలా ఎలాంటి తారతమ్యాలు ఉండవు. దీనికి తగ్గట్లే నేటి యువత ప్రేమకున్న నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే ఈ రోజుల్లో వినూత్నమైన ప్రేమకథలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి మరో వెరైటీ ప్రేమకథే వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రేమలో పడ్డాక ప్రపంచాన్నే మర్చిపోతారంటారు. ఈ ప్రేమకథలో కూడా అంతే. బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసులో 22 ఏళ్ల గ్యాప్‌ ఉంది. అయినా వారికి ఇది కనిపించలేదు. ఈ వినూత్నమైన ప్రేమకథకు కోచింగ్‌ సెంటర్‌లో పునాది పడింది. ఉపాధ్యాయుడు నిర్వహిస్తోన్న ఈ కోచింగ్‌ సెంటర్‌లో ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వచ్చింది స్టూడెంట్‌.

ఆ మాస్టర్‌ విద్యార్థినికి ఎలాంటి పాఠాలు చెప్పాడో తెలియదు కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్న వీరిద్దరు తాజాగా గుడిలో వివాహం చేసుకున్నారు. చుట్టుపక్కల వారు, కోచింగ్‌ సెంటర్‌లో చదువుకుంటోన్న విద్యార్థులు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గురువుగారి మొదటి భార్య చాలా ఏళ్ల క్రితమే మరణించింది. అయితే అతను మాత్రం రెండవ పెళ్లి చేసుకోవడంపై ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే ఈ విద్యార్థిని కోచింగ్ సెంటర్‌లోకి అడుగుపెట్టిందో ఆమెపై ప్రేమ మొదలైంది. ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. ఇందుకు విద్యార్థిని కూడా అంగీకరించడంతో ఎంచెక్కా ఏడడగుగులు నడిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..