Trending Video: ఆమె టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. పోలీస్.. బాక్సర్.. రైడర్.. మోడల్.. తాజాగా డ్యాన్సర్..
చాలా మందిలో మల్టీ టాలెంట్స్ ఉంటాయి. అవ్వన్నీ ఒక వయసు వరకు.. ఉద్యోగం వచ్చి.. జాబ్‌లో సెటిలైతే తీరికలేని జీవితం.. అదే పోలీస్ ఉద్యోగం అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 24 గంటల ఉద్యోగం.. సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ.. పోలీసు అధికారిగా..
చాలా మందిలో మల్టీ టాలెంట్స్ ఉంటాయి. అవ్వన్నీ ఒక వయసు వరకు.. ఉద్యోగం వచ్చి.. జాబ్‌లో సెటిలైతే తీరికలేని జీవితం.. అదే పోలీస్ ఉద్యోగం అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 24 గంటల ఉద్యోగం.. సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ.. పోలీసు అధికారిగా ఉంటూనే వివిధ రంగాల్లో సత్తా చాటుతోంది. బాక్సర్‌గా, బైక్ రైడర్‌గా, మోడల్‌గా రాణిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో ప్రశంలందుకుంది ఆ మహిళ.. ఇటీవల ప్రముఖ పారిశ్రామివేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఆమె టాలెంట్‌కు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. లతా మంగేష్కర్ పాడిన మేరా దిల్ యే పుకారే ఆజా పాటకు ఇటీవల ఓ పాకిస్తానీ మహిళ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ నృత్యాన్ని రీక్రియేట్ చేస్తూ సిక్కింకు చెందిన ఓ మహిళా పోలీసు చేసిన డ్యాన్స్ వీడియో తాజాగా సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
1954 నాటి నాగిన్ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన ఫేమస్ సాంగ్ మేరా దిల్ యే పుకారే ఆజాకు ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన మహిళ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ వీడియోలో మహిళ చేసిన డ్యాన్స్‌ను రీక్రియేట్ చేస్తూ అనేక వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సిక్కింకు చెందిన మహిళా పోలీస్ ఓ రహదారిపై మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు పాకిస్తాన్ మహిళ చేసిన స్టెప్స్‌ను తలపించేలా డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను మిలియన్ల మంది ప్రజలు ఇప్పటివరకు వీక్షించారు.
సిక్కింకు చెందిన ఏక్షా కెరుంగ్ పోలీసు అధికారి. అలాగే బాక్సింగ్, బైక్ రైడింగ్ తో పాటు మోడలింగ్‌లో కూడా సత్తా చాటుతోంది. రుంబుక్ గ్రామంలో పుట్టిన ఏక్షాకు చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. అయితే అప్పటికి తమ గ్రామంలో బాక్సింగ్ శిక్షణ అందుబాటులో ఉందని ఆమెకు తెలియదు. తన కలలు, అభిరుచులను తెలుసుకున్న తన తండ్రి.. అవి సాకారం చేసుకునేలా దారి చూపించారని ఏక్షా గతంలోనే చెప్పింది. బాక్సింగ్‌లో సిక్కిం తరపున జాతీయ టోర్నమెంట్లకు ప్రాతినిధ్యం వహించింది. ఏక్షా కు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలుసుకున్న తండ్రి, సోదరుడు ఆమెను ప్రోత్సహించారు. సోదరుడికి బైక్ నేర్పిస్తున్న క్రమంలో.. తన ఇష్టాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు ఏక్షా కెరుంగ్‌కు కూడా రైడింగ్ నేర్పించారు. 2019లో సిక్కిం పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించింది. కానీ.. ప్రభుత్వ ఉద్యోగంతో తృప్తి పడలేదు ఏక్షా. అది తన కల. కానీ.. తన ప్యాషన్ మరొకటి ఉంది. అదే మోడల్ అని చెప్పడంతో పాటు.. మోడల్‌గా తన సత్తా చాటుతూ . మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటోంది ఏక్షా కెరుంగ్.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..