వండిన తరువాత అన్నాన్ని ఎప్పటిలోపు తినాలో తెలుసా.. రాత్రి మిగిలిన ఫుడ్ ఉదయం తింటే ఈ సమస్యలు రావచ్చు..

నేటి ఆధునిక కాలంలో అందరూ బిజీ అయిపోతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబంలోని సభ్యులంతా కష్టపడితేనే.. కుటుంబం నడుస్తుంది. ఈ క్రమంలో తినడానికి కావల్సిన ఆహారాన్ని ఒకేసారి తయారుచేసుకోవడం..

వండిన తరువాత అన్నాన్ని ఎప్పటిలోపు తినాలో తెలుసా.. రాత్రి మిగిలిన ఫుడ్ ఉదయం తింటే ఈ సమస్యలు రావచ్చు..
Storage Food
Follow us

|

Updated on: Dec 10, 2022 | 6:05 PM

నేటి ఆధునిక కాలంలో అందరూ బిజీ అయిపోతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబంలోని సభ్యులంతా కష్టపడితేనే.. కుటుంబం నడుస్తుంది. ఈ క్రమంలో తినడానికి కావల్సిన ఆహారాన్ని ఒకేసారి తయారుచేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది రెండు పూటలకు అవసరమైన ఆహారాన్ని ఒకేసారి తయారు చేసుకుంటే.. మరికొంతమంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం టిఫిన్‌ బదులు తింటుంటారు. సాధారణంగా ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలామందికి అలవాటు. ఇలాంటి అలవాలు ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. లేకపోతే పాడైన అన్నం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మిగిలిపోయిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలు వెల్లడించాయి. మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా కావొచ్చు.

బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మారుతుంది. దీని తరువాత ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అందువల్ల అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అన్నం చాలా సమయం నిల్వ ఉంటే తినకూడదు.

సరైన పద్దతి ఏంటంటే మీరు అన్నం వండిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలలోపు తినాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది. అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..