Winter Health: చలికాలంలో హైబీపీ ముప్పు అధికం.. ఈ చిన్న చిన్న మార్పులతో ఈజీగా బయటపడొచ్చు..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Dec 10, 2022 | 5:58 PM

అన్ని కాలాలలో పోలిస్తే చలికాలంలో వాతావరమం చాలా నిర్మలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వింటర్ సీజన్ కాస్త చిరాకు కలిగించినా.. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ కాలాన్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు...

Winter Health: చలికాలంలో హైబీపీ ముప్పు అధికం.. ఈ చిన్న చిన్న మార్పులతో ఈజీగా బయటపడొచ్చు..
Bp

అన్ని కాలాలలో పోలిస్తే చలికాలంలో వాతావరమం చాలా నిర్మలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వింటర్ సీజన్ కాస్త చిరాకు కలిగించినా.. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ కాలాన్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు. అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 లోపే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శీతాకాలం మంచి సమయాలను మాత్రమే కాకుండా మన శరీరంలో అనేక మార్పులను కూడా కలిగిస్తుంది. వాటిలో ఒకటి రక్తపోటు. ఎందుకంటే రక్తనాళాలు ఉష్ణోగ్రతను బట్టి కొద్దిగా కుంచించుకుపోతుంటాయి. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. రక్త నాళాలు కుచించుకుపోవడం ద్వారా రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు దారి తీస్తుంది. అయితే.. చలికాలంలో రక్తపోటు పెరగడం సహజమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని హెచ్చరిస్తున్నారు.

నాళాల ద్వారా రక్తాన్ని తీసుకువెళ్లడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీంతో ఇరుకైన రక్త నాళాల్లో రక్త ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. చల్లని శీతాకాలపు రోజుల్లో శారీరక శ్రమ తగ్గడం అధిక రక్తపోటుకు మరొక కారణంగా మారుతోంది. కాబట్టి వింటర్ సీజన్ లో ఆరోగ్యం పరంగా చాలా అలర్ట్ గా ఉండాలి. తీసుకునే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు విషయంలో ఇటువంటి ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. వృద్ధుల్లో కూడా ఈ సమస్య ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. అధిక రక్తపోటుతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వారినీ ప్రభావితం చేసే కొమొర్బిడిటీలు వృద్ధి చెందుతాయి. అందువల్ల, పెద్దలను రక్షించడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే డైట్ చార్ట్‌ను సిద్ధం చేయడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, శారీరక శ్రమ స్థాయిలను కూడా పెంచడం చాలా ముఖ్యం. శీతాకాలంలో బయట నడవలేకపోతే ఇంట్లోనే వ్యాయామం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇటువంటి మెరుగుదలలు మీ ఆరోగ్యకరమైన దినచర్యను కూడా కొనసాగించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu