AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆదివారం నాడు నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 11న గోవా, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్- షిర్డీ మధ్య 520 కి.మీల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ మొదటి దశ ఎక్స్‌ప్రే వే నిర్మాణ పనులకు

PM Modi: ఆదివారం నాడు నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..
Pm Modi
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2022 | 2:02 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 11న గోవా, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్- షిర్డీ మధ్య 520 కి.మీల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ మొదటి దశ ఎక్స్‌ప్రే వే నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దేశ వ్యాప్తంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీలో సమృద్ధి మహామార్గ్ ప్రాజెక్టు కీలక ముందుడుగు అని పేర్కొంటున్నాయి అధికారిక వర్గాలు. భారతదేశంలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వేలలో ఒకటైన ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని 10 జిల్లాలతో పాటు. ప్రఖ్యాత పట్టణాలైన అమరావతి, ఔరంగాబాద్, నాసిక్‌ల గుండా వెళ్తుంది. దీని నిర్మాణానికి దాదాపు రూ. 55,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచన వేస్తున్నారు.

అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్స్‌ప్రెస్ వే పక్కనే ఉన్న 14 ఇతర జిల్లాల కనెక్టివిటీ కూడా మెరుగుపడనుంది. తద్వారా విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని దాదాపు 24 జిల్లాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. పీఎం గతి శక్తి స్కీమ్‌లో భాగంగా సమృద్ధి మహామార్గ్, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్, లోనార్ మొదలైన పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడం జరుగుతుంది. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు మరింత ఊతమివ్వనుంది.

నాగ్‌పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌తో పాటు, నాగ్‌పూర్ మెట్రో, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ మెట్రో పనులను కూడా ప్రధాని నరేంద్ర ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..