Viral: నీ కోపం తగలెయ్య.. ఎదుటి వ్యక్తి బూతులు తిట్టాడని అతను చేసిన పనికి విస్తుపోయిన జనం..
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే ఏం జరుగుతుంది? సాధారణంగా అయితే కొట్టుకుంటారు? తన్నుకుంటారు? ఇంకా కోపం వస్తే కర్రలు, కత్తులు, కటార్లతో దాడులు చేసుకుంటారు. ఒకరిపై ఒకరు ఇలా తీవ్రంగా దాడులు
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే ఏం జరుగుతుంది? సాధారణంగా అయితే కొట్టుకుంటారు? తన్నుకుంటారు? ఇంకా కోపం వస్తే కర్రలు, కత్తులు, కటార్లతో దాడులు చేసుకుంటారు. ఒకరిపై ఒకరు ఇలా దాడులు చేసుకుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే గొడవ గురించి తెలిస్తే మాత్రం బిత్తరపోయి నోరెళ్లబెడతారు. అవును మరి.. ఒక గొడవలో ఆగ్రహంతో రగిలిపోయిన వ్యక్తి.. మరో వ్యక్తి నాలుకను కొరికేశాడు. పూర్తిగా కొరికేయడంతో ఆ నాలుక తెగి బయటపడింది. ఆస్పత్రికి వెళ్లినా రీ జాయింట్ అవ్వలేదు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొహాలీలోని డేరా బస్సీలో ఇద్దరు పొరిగింటి వారి మధ్య గొడవ జరిగింది. హర్‌ప్రీత్, ఆసిఫ్ ఇద్దరూ తమ తమ వాహనాల్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. స్థానిక పాఠశాల వద్ద ఇద్దరి వీరు కార్, బైక్ క్రాష్ అయ్యాయి. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరిగి భౌతికదాడుల వరకు వెళ్లింది మ్యాటర్. ఇంతలో హర్‌ప్రీత్ తీవ్రంగా దుర్భాషలాడటంతో ఆగ్రహంతో రగిలిపోయాడు ఆసిఫ్. హర్‌ప్రీత్‌పై దాడి చేశాడు. నోటితో కొరికాడు. ఈ క్రమంలో హర్‌ప్రతీ నాలుకను కూడా కొరికాడు. చాలా బలంగా హర్‌ప్రీత్ నాలుకను ఆసిఫ్ కొరకడంతో.. అది కట్ అయ్యింది. నాలుక తెగి కిందపడిపోయింది. అనంతరం ఆసిఫ్ అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఇది గమనించిన స్థానికులు హర్‌ప్రీత్‌ను తెగిన నాలుకతో సహా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి హర్‌ప్రీత్‌కు చుక్కెదురైంది. తెగిన నాలుకను అతికించడం సాధ్యం అవ్వలేదు. వైద్యులు చికిత్స చేసినా.. అది ఫలించలేదు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..