Robbery: ఇలా కూడా దోచేస్తారా?.. జస్ట్ అలా ‘ఏటీఎం’కు వెళ్లి ఇలా 4 లక్షలు కొట్టుకొచ్చాడు..

చోరులందు ఈ చోరుడు వేరయా. అవును, నక్కజిత్తుల తెలివి తేటలు కలిగిన ఓ దొంగ.. నిమిషాల్లోనే ఏటీఎం నుంచి రూ. 4 లక్షలు కాజేశాడు. ఎవరు కాజేశారో కూడా తెలియకుండా పకడ్బందీ ప్లాన్‌తో..

Robbery: ఇలా కూడా దోచేస్తారా?.. జస్ట్ అలా ‘ఏటీఎం’కు వెళ్లి ఇలా 4 లక్షలు కొట్టుకొచ్చాడు..
Atm Robbery
Follow us

|

Updated on: Dec 08, 2022 | 5:00 PM

చోరులందు ఈ చోరుడు వేరయా. అవును, నక్కజిత్తుల తెలివి తేటలు కలిగిన ఓ దొంగ.. నిమిషాల్లోనే ఏటీఎం నుంచి రూ. 4 లక్షలు కాజేశాడు. ఎవరు కాజేశారో కూడా తెలియకుండా పకడ్బందీ ప్లాన్‌తో.. దర్జాగా ఏటీఎంలోకి వెళ్లి మరీ దోచుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. ఈ కేటుగాడు.. రెండు ఏటీఎం సెంటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. రూ. 4 లక్షలు కాజేశాడు. ఇందుకోసం 14 డెబిట్ కార్డులను ఉపయోగించి 37 లావాదేవీలను చేశాడు. ఏటీఎంల నిర్వహణనను చూసుకునే కంపెనీ యాజమాన్యం వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఘరానా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లీలలో రెండు ఏటీఎం మెషీన్లలో భారీ చోరీ జరిగింది. అక్టోబర్ 17, 18 తేదీల్లో రూ. 3.28 లక్షలు, అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో రూ. 79 వేలుగు కాజేశారు దుండగులు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్వహణ సంస్థ ప్రతినిధులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

11 డెబిట్ కార్డులను ఉపయోగించి డబ్బును దోచుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక మెషీన్ నుంచి 11 డెబిట్ కార్డులను ఉపయోగించి 33 లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో 3.28 లక్షలు, మూడు డెబిట్ కార్డులను ఉపయోగించి అక్టోబర్ 13న రూ. 79,000 కాజేశారు. ఈ చోరీకి పాల్పడిన సమయంలో ఏటీఎం మెషీన్‌కు పవర్ సప్లయ్ నిలిపివేశారు. దాంతో ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా అయ్యింది కానీ, బ్యాంక్ సర్వర్ ఆ లావాదేవీలను రికార్డ్ చేయలేకపోయింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఏటీఎంలలో అమర్చిన సీసీటీవీలో ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అవ్వలేదు.

ఇవి కూడా చదవండి

కాగా, చోరీకి పాల్పడిన నిందితులపై ఐపీసీ సెక్షన్లు 34, 420, 65, 66C, 66D కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని ఈ అగంతకులను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. టెక్నికల్ ప్రూఫ్స్ ఆధారంగా కేటుగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం