India – Pak Boarder: పాకిస్తాన్ కు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్.. పొగమంచుతో దారి కనిపించక.. సీన్ కట్ చేస్తే..

ఇండియా - పాకిస్తాన్ బార్డర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సమీప గ్రామాల ప్రజలు, నియంత్రణ రేఖ వెంబడి నివాసం ఉండే వారు అనుక్షణం ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జీవిస్తుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే...

India - Pak Boarder: పాకిస్తాన్ కు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్.. పొగమంచుతో దారి కనిపించక.. సీన్ కట్ చేస్తే..
Boarder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 08, 2022 | 4:44 PM

ఇండియా – పాకిస్తాన్ బార్డర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సమీప గ్రామాల ప్రజలు, నియంత్రణ రేఖ వెంబడి నివాసం ఉండే వారు అనుక్షణం ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జీవిస్తుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటుంటారు. అయితే బార్డర్ వద్ద పౌరులు రేఖ దాటడం అప్పుడప్పుడు జరుగుతుంది. దీనిని బోర్డర్ స్టాఫ్ ఆఫీసర్స్ పసిగట్టి.. వెంటనే వారిని ఆధీనంలోకి తీసుకంటారు. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో ఇండియాకు చెందిన ఓ బీఎస్ఎఫ్ జవాన్ సరిహద్దు దాటారు. వెంటనే విషయం తెలుసుకున్న పాక్ భద్రతా బలగాలు అతనిని అదుపులోకి తీసుకున్నాయి. భారత ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని పాకిస్తాన్ రేంజర్లు పట్టుకోవడం ఇది రెండో సారి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుడు పంజాబ్ సెక్టార్‌లో గస్తీ తిరుగుతున్నారు. బుధవారం ప్రమాదవశాత్తు భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు దాటగా, పాక్‌ రేంజర్లు అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు. భారత ఆర్మీ జవాన్‌ను పాక్ రేంజర్లు ఇంకా అప్పగించలేదని ఆయన అన్నారు.

అంతకు ముందు డిసెంబర్ 1న ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో గస్తీ తిరుగుతుండగా.. ఓ జవాన్ పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించాడు. అదే రోజు పాకిస్థాన్ రేంజర్లు ఫ్లాగ్ మీటింగ్ తర్వాత జవాన్‌ను తిరిగి బీఎస్ఎఫ్ కు అప్పగించారు. ఈ జవాన్ అబోహర్ సెక్టార్‌లోని ఫోర్స్ పోస్ట్ సమీపంలో జీరో లైన్ లో పెట్రోలింగ్ చేస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం పట్టుబడిన జవాన్.. విడుదల విషయంలో సమాచారం అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని అబోహర్ సెక్టార్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఆ జవాన్‌కు ‘జీరో లైన్‌’ కనిపించకపోవడంతో దాన్ని దాటుకుని పాకిస్థాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాడు.

పాకిస్తాన్‌లో ఉన్న స్మగ్లర్లు చలి కాలంలో పొగమంచును అవకాశంగా తీసుకుని తరచూ ఆయుధాలు, డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తుంటారు. దీనిని నివారించడానికి, ‘బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్’ సైనికులు ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. దీంతో సైనికులు ఆ ప్రాంతమంతా పెట్రోలింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి దేశం భద్రత కోసం సరిహద్దును నిర్ణయిస్తుంది, దీనిని జీరో లైన్ లేదా అంతర్జాతీయ సరిహద్దు అంటారు. ఒక దేశంలోని సైన్యం లేదా పౌరులు ఈ రేఖను దాటితే, అది ఇతర దేశం చొరబాటుదారుగా పరిగణిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..