Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా మ్యాజిక్.. గుజరాత్‌ ఎన్నికల్లో భార్య రివాబా ఘన విజయం..

బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రివాబా.. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు.

Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా మ్యాజిక్.. గుజరాత్‌ ఎన్నికల్లో భార్య రివాబా ఘన విజయం..
Rivaba Jadeja
Follow us

|

Updated on: Dec 08, 2022 | 2:10 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులన్నీ బ్రేక్ చేసింది. దాదాపు 157 సీట్లలో పూర్తి ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఆప్.. బీజేపీ ప్రభంజనం ముందు చతికలపడ్డాయి. కాగా.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రివాబా.. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు. తనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు.. తన కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తన విజయం మాత్రమే కాదు.. ప్రజలందరి విజయం అంటూ రివాబా సంతోషం వ్యక్తం చేశారు.

నార్త్‌ జామ్‌నగర్‌ నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో ఆమెకు 55% పైగా ఓట్లు వచ్చాయి. ఆమె తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అహిర్ కరాషన్‌భాయ్ పర్బత్‌భాయ్ కర్మూర్ (23.37%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసిఘ్ చతుర్‌సిన్హ్ జడేజా (15.49%) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా సైతం ప్రచారం చేశారు. అయితే, జడేజా సొంత చెల్లి నైనా జడేజా కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వదినపై తీవ్ర విమర్శలు సైతం చేశారు.

కాగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకుగాను ఇప్పటి వరకు 157 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..