నిద్రపోయే ముందు ఈ డ్రింక్స్ తాగితే.. జిమ్‌కి వెళ్లాల్సిన పనే ఉండదు.. ఇంకా మస్త్ బెనిఫిట్స్..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఈ రోజుల్లో జిమ్‌కి వెళ్లే ట్రెండ్ బాగా పెరిగింది. బరువు తగ్గడానికి జిమ్‌లో చెమటలు పట్టిస్తుంటారు.

నిద్రపోయే ముందు ఈ డ్రింక్స్ తాగితే.. జిమ్‌కి వెళ్లాల్సిన పనే ఉండదు.. ఇంకా మస్త్ బెనిఫిట్స్..
Weight Loss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2022 | 8:00 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఈ రోజుల్లో జిమ్‌కి వెళ్లే ట్రెండ్ బాగా పెరిగింది. బరువు తగ్గడానికి జిమ్‌లో చెమటలు పట్టిస్తుంటారు. అయితే జిమ్‌కి వెళ్లకుండా కూడా బరువు తగ్గవచ్చు. కొన్ని సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించడం ద్వారా మనం బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు కొన్ని పానీయాలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటి ద్వారా ఊబకాయాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. వీటిని రాత్రి వేళ నిద్ర పోయే ముందు లేదా.. ఉదయాన్నే తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును తగ్గించే పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెంతి గింజలు నీరు

మెంతి నీళ్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మెంతి గింజలను నానబెట్టి వాటి నీటిని తాగాలి. ఈ నీరు వెంటనే ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మెంతి నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల ఫ్యాట్ కరిగిపోతుంది. ఊబకాయంతో పాటు అనేక వ్యాధులకు కూడా ఈ నీరు మేలు చేస్తుంది.

దాల్చిన చెక్క పానీయం

దాల్చిన చెక్క టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఇందులో మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. కొవ్వు వేగంగా కరిగిపోతుంది. దాల్చిన చెక్కను ఉడికించి వడపోసి ఈ నీటిలో తేనె కలుపుకుని తాగాలి. దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు పాలు

పాలు తాగితే బరువు పెరుగుతారని, పసుపు పాలు తాగితే బరువు తగ్గుతారనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇందులో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని బలపరచడంతోపాటు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు పాలు తాగడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడుతుంది. ఇంకా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఈ చిట్కాలను అనుసరించండి

ఆహారంతో పాటు, బరువు తగ్గడానికి మీరు కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు. మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే, మీరు ఇంట్లోనే కొన్ని బరువు తగ్గించే వ్యాయామాలు లేదా యోగాను మీ జీవనశైలిలో భాగంగా చేసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..